Advertisement
Google Ads BL

అనసూయ మందేస్తే..మాములుగా ఉండదట!


యాంకర్ గా మంచి జోరుమీదున్న బుల్లితెర భామ అనసూయ. జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకొని బుల్లితెర నుండి వెండితెరకు అలా అటూ ఇటూ లాగుతూ తన అందాలతో కుర్రకారును కిర్రిక్కిస్తుంది అనసూయ. అసలిప్పుడు సినిమా హీరోయిన్స్ కు ధీటుగా టివి యాంకర్స్ కూడా జోరు ప్రదర్శిస్తున్నారనుకోండి. అది వేరే విషయం. స్టార్ హీరోయిన్స్ కి ధీటుగా ఇమేజ్ తెచ్చుకుంది ఈ క్రేజీ హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం అనసూయ క్రేజ్, ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఈమెకున్న క్రేజ్ ను చూసి హీరోయిన్స్ కూడా కుళ్ళుకోకమానరు. అంతటిదన్న మాట ఆమె కత్తరనాక్ హాట్ అందం. బుల్లితెరతో పాటు మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ భామకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ మధ్య ఐటెం సాంగ్ చేయమని ఛాన్స్ వచ్చినా కాదు కూడదు అని చెప్పేసిందట. ఇప్పుడైతే అనసూయ చేతినిండా పనితో అటు బుల్లితెరను, ఇటు వెండితెరను ఏలుతుందనే చెప్పాలి. పలు ఆడియో వేడుకలు, సినిమా కార్యక్రమాలు, టివిల షోలు అని నిరంతరం బిజీబిజీగా తిరుగుతుంది ఈ భామ. 

Advertisement
CJ Advs

అయితే  తాజాగా అనసూయ ఓ ఛానల్ లో ‘డేట్ విత్ అనసూయ’ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో అనసూయ చెప్పిన మాటలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన అందాల భామ రెజినాతో చిట్ చాట్ లో భాగంగా తాగుడు గురించి మాట్లాడుకుందాం అని అనసూయ  రెజీనాతో నువ్వు ఎప్పుడైనా తాగావా అని అడిగింది. రెజీనా  ఉండి సిగ్గుపడుతూనే.. తాను తన గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి అప్పుడప్పుడు కొద్దిగా తాగుతాను అని చెప్పింది. ఆ తర్వాత వెంటనే రెజినా మరి నీ సంగతి ఏంటి అనసూయ అని అడిగింది అప్పుడు చెప్పడం అనసూయ వంతైంది. ఒక్కసారిగా అనసూయ.. నేను కూడా అప్పుడప్పుడు తాగుతాను అని చెప్పి చూపరులు ముక్కున వెేలేసుకునేలా వ్యవహరించింది. అంతేకాకుండా....తాను తాగితే బలయ్యేది తన భర్తే... అంటూ చెప్పకొచ్చి అందరినీ అశ్చర్యపరచింది అనసూయ. ఇప్పటి వరకు చాలా మంది భామలు కూడా తాగుతారని తెలుసుకానీ, ఇలా బహిరంగంగా ప్రకటించడం ఇంతవరకు చూడని, వినని వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తానికి అప్పుడప్పుడు తాగేసి అనసూయ ఇంటికెళ్ళి మొగడిని ఇబ్బంది పెడుతుందన్నమాట. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs