Advertisement
Google Ads BL

ఆ 12 మంది తెదేపా నేతలపై అనర్హత వేటు!


తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఆ తర్వాత అధికారం కోసం తెరాసాలోకి వెళ్ళిన జెంప్ జిలానీలపై హైకోర్టు దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది. టీటీడీఎల్పీ నేత‌ రేవంత్ రెడ్డి మిన‌హా మిగ‌తా 12మంది తెదేపా ఎమ్మెల్యేలు సైకిల్ చెల్లని కాసు అంటూ కారెక్కేసిన విషయం తెలిసిందే. తెలంగాణ తేదేపాలో మిగిలింది ఒకే ఒక్క‌డు! అతడే రేవంత్ రెడ్డి. మిగతా వారంతా  తేదేపాకి భారీ హ్యాండిచ్చి కారెక్కేశారు. ఇప్పుడు వారంతా పెద్ద ప్రమాదంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. తమకంతా అండ‌గా ఉంటాడు అనుకున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు కూడా గులాబీ ఆక‌ర్ష్ లో చిక్కుకున్నాడు. మొత్తం 12 మంది తేదేపా నేత‌లు తెరాస ఆక‌ర్ష్ ఎరలో ప‌డిపోవ‌డంతో తెలంగాణ‌లో తెదేపా పట్టు ఉన్నా లేనట్టుగా తయారైంది. ప్రస్తుతం తెలంగాణలో తెదేపా ఏం చేయాలో తెలీని ఒకరకమైన ఆగ‌మ్య గోచ‌రంలో పడింది. తేదేపా నేతలంతా కారెక్కడంతో ఒక్కసారిగా రగిలిపోయిన ఎర్రబెల్లి అప్పట్లో పార్టీ ఫిరాయింపుల‌పై సుప్రీంలో పిటిష‌న్ కూడా వేశాడు. కానీ తర్వాత ఎర్ర‌బెల్లి కూడానూ మెలకువగా వ్యవహరించి కారెక్కిన విషయం తెలిసిందే. ఇలా రాజకీయాల్లో అప్పుడప్పుడు ఊహించని, చాలా గమ్మత్తయిన ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడే పార్టీ అధినేత గుండెను నిబ్బరం చేసుకోవాలంటారు. అంతవరకు ఓకే.. ఇప్పుడు తెతెదేపా నేతలు, కార్యకర్తలు పండుగ చేసుకునే పనిలో పడ్డారు. అదేంటంటే సైకిల్ ను కాదని కారెక్కిన వారికి ఊహించని రీతిలో హైకోర్టు షాకిచ్చింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుత పరిస్థితులను చూడబోతే ఆ 12మంది తెదేపా నేతలపై వేటు పడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా పార్టీ ఫిరాయించిన వారికి వ్య‌తిరేకంగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. వీరంద‌రిపై అన‌ర్హ‌త వేటు వేయాల్సిందని కూడా తుది తీర్పును ప్రకటించింది హైకోర్టు. దీంతో ఆ జంపింగ్ నేతలంతా ల‌బోదిబో మంటున్నారు. ఇలా చట్టమే సంకటంగా మారుతుందని ముందు భావించిన వారంతా ఈ తీర్పుతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వారందరిపై వేటు వేయాల్సిందేనంటూ ఇప్ప‌టికే అసెంబ్లీ స్పీక‌ర్‌కు కూడా ఆదేశాలందాయి. ప్రస్తుతం స్పీకర్, తెరాస ఏం చేయబోతుందన్నది అందరికీ ఆసక్తికరాంశంగా మారింది.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs