Advertisement
Google Ads BL

'బాహుబలి' తో బాలీవుడ్‌ లెక్క మారింది!


'బాహుబలి' చిత్రంతో తెలుగు చిత్రాల సత్తా ఏమిటో బాలీవుడ్‌కి తెలిసొచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ తాజాగా రానా హీరోగా తాప్పి కీలకపాత్రలో నటించిన 'ఘాజీ' చిత్రం బాలీవుడ్‌ హక్కులను కూడా పొంది హిందీలోఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. కాగా ఈ చిత్రం హక్కులు కరణ్‌జోహార్‌ తీసుకోవడంతో 'ఘాజీ' చిత్రంపై కూడా బాలీవుడ్‌ ఈ ఆసక్తిని చూపిస్తోంది. ఇక రామ్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'హైపర్‌' చిత్రం కూడా విడుదలకు ముందే బాలీవుడ్‌ వర్గాలను ఆకర్షిస్తోంది. ఇంకా తెలుగులో కూడా విడుదల కాని ఈ చిత్రంపై బాలీవుడ్‌ వర్గాల కన్నుపడింది. ఈ చిత్రం బాలీవుడ్‌ రీమేక్‌ హక్కులను ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్ద రూ.2 కోట్లను వెచ్చించి ఈ చిత్రం రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. మొత్తానికి చిత్రం విడుదలకు ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ రావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్న 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్ద అధినేతలు ఆనందంగా ఉన్నారు. కాగా ఈ చిత్రంపై ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs