భారతదేశంలో భాగమైన కాశ్మీర్‌లోని యురి సెక్టార్ ప్రాంతంలోని సైనిక శిబిరంపై ఆదివారం పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి జరిపి పలువురిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇది భారత్ కు ప్రస్తుతం పెను సవాల్ గా మారింది. ఇదే కాకుండా పాకిస్తాన్ పలుసార్లు కయ్యానికి కాలు దువ్వుతూ భారత్‌పై పరోక్షంగా యుద్ధానికి సై అన్నట్లు సంకేతాలు పంపుతుంది. ఇటువంటి పరిస్థితిల్లో భారత్- పాకిస్తాన్ కు యుద్ధమే సంభవిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఒకసారి చూద్దాం. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం చర్చకు వచ్చింది.
పాకిస్థాన్‌తో భారత్ యుద్ధమే వస్తే భారత్ లోనే పటిష్టమైన, నిర్మాణాత్మకమైన వ్యవస్థ ఉంది. ఈ విషయం పాకిస్థాన్‌కు కూడా బాగా తెలుసు. కానీ పాకిస్థాన్ సైన్యం క్రియాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి పాక్, భారత్ పై యుద్ధం చేయడానికి ఏ మాత్రం వెనుతిరగదు. ఒకవేళ పాకిస్తాన్ పై ప్రత్యక్ష యుద్ధం చేయాలని భారత్ భావిస్తే ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా వరకు అందరి అనుమతి తీసుకోవాలి. కానీ అమెరికా, పాకిస్థాన్ టెర్రరిజంపై యుద్ధం చేస్తానంటుందే గానీ పాక్‌పై యుద్ధానికి మద్దతిచ్చే ఉద్ధేశం ఏమాత్రం లేదన్నది జగమెరిగిన సత్యం. ఇంకా భారత్ కన్నా బలంగా ఉన్న చైనా కూడా అటు పాక్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. అందువల్ల చైనా.. పాకిస్తాన్ కు ఖచ్చితంగా మద్దతిస్తుంది. యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తే ఇరుదేశాల్లో బీభత్సంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. రంగంలోకి దిగాలే గానీ ఇది అంతర్జాతీయ సమస్యకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఏది ఏమైనా బీభత్సకర పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. అలా కాకుండా భారత్ పాక్ పై పరోక్ష యుద్ధమే జరిపితే... తరతరాలుగా పాక్ ఎన్నో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది. పాక్‌కు వ్యతిరేకంగా ఏ ఉగ్రవాద సంస్థ కూడా భారత్ భూభాగంలో లేదు. అలాంటప్పుడు పాక్ ను పరోక్షంగా ఢీకొనాలంటే భారత్ చాలా మెలకువగా, వ్యూహాత్మకంగా, ఇప్పటినుంచైనా అందుకోసమని ప్రత్యేక కమాండోలను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పఠాన్‌కోట్, పాంపోర్, యురి వంటి అతిపెద్ద ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటన్నింటిని పటిష్టంగా ఎదుర్కోవాలంటే ఎదుటి వారు ఎంత జాగృకతతో వ్యవహరిస్తున్నాడో అంతకంటే మెలకువతో బారత్ లేకుండా ఇంకా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. భారత్ సైన్యం ఎన్నడూ లేని విధంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలే లేకుండా దాడికి పాల్పడటమే ఇక్కడ ముందున్న మార్గం. అందుకు భారత్, అమెరికా జరిపిన ఆపరేషన్ లో భాగంగా లాడెన్, సద్ధాం హుస్సేన్ జాడ కూడా లేకుండా చేసిన విధానాన్నే అవలంభించాలి. అమెరికా సైన్యం పాకిస్థాన్‌లో ఎవరికీ తెలీకుండా ఒసామా బిన్‌లాడెన్‌ను తుదముట్టించింది. అలాగే ఇరాక్‌లో సద్ధాం హుస్సేన్ ను తన స్పెషల్ ఆపరేషన్ కమాండ్ తరహాలో తుదముట్టించింది. అలా అమెరికా తరహా స్పెషల్ కమాండో వ్యవస్థను భారత్ ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కమాండోలు భారత్ కు ఎప్పటికైనా అవసరమని పలువురు సైన్యాధిపతులు కూడా సూచించిన విషయం తెలిసిందే. ఇటువంటి ప్రత్యేక ఆపరేషన్లను జరిపే శక్తి సామర్థ్యాలు మన పారా మిలిటరీ దళాల్లో 1.9,10, 21 బెటాలియన్లకు ఉన్నాయి. బారత్ సైన్యంలోని ఇలాంటి దళాలతోపాటు, వైమానిక దళాల నుండి కూడా కొన్ని కమాండోలను ప్రత్యేకంగా తీసుకొని భారత్ ప్రత్యేక ఆపరేషన్ కమాండో వ్యవస్థను సృష్టించుకోవాల్సిన అవసరం ఆవస్యకత ఎంతైనా ఉంది. అలాగైనప్పుడే కయ్యానికే కాలుదువ్వే ఏ దేశానికైనా ధీటుగా బదులు చెప్పవచ్చు. ఆయా దేశాలను సునాయాసంగా ఎదుర్కోనూవచ్చు. ఆ దిశగా భారత్ అడుగులు వేస్తుందని ఆశిద్ధాం.