Advertisement
Google Ads BL

స్వయంగా చంద్రులే దిగారు రంగం లోకి..!!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడగొడితే నీటి పంపిణి విషయంలో గొడవలు తలెత్తుతాయని అందరూ ఎప్పటినుండి నెత్తి నోరు బాదుకుని చెప్పారు. కానీ సోనియమ్మ వీటిని లెక్క చెయ్యకుండా రాష్టాన్ని ముక్కలు చేసేసింది. ఇక ఇప్పుడు కృష్ణా జలాలు, గోదావరి జలాల పంపిణీలో ఇరు రాష్ట్రాలు ఉప్పు, నిప్పు గా మారి కొట్టుకుంటున్నాయి. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి  ఇరు రాష్ట్రాల సీఎం లను కలిపి మాట్లాడటానికి కేంద్ర జలవనరుల మంత్రి సిద్ధమయ్యారు.

Advertisement
CJ Advs

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకోబోతున్నారు. అవునండి ఇది నిజమే వీరిద్దరూ... ఢిల్లీ లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై చర్చలు జరపబోతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి  నేతృత్వం లో వీరిద్దరూ కలుసుకోబోతున్నారు. ఆపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో భేటీకి అంతా రెడీ అయ్యారు. ఈ చంద్రులిద్దరూ ముఖ్యం గా పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతలు పథకాలపై,  కృష్ణా, గోదావరి జలాల్లో వాటా గురించి చర్చలు జరపబోతున్నారు. వీరిద్దరూ తమ, తమ వాదనలు జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ముందు గట్టిగా వినిపించడానికి సిద్ధమయ్యారు. 5 అంశాలలో ప్రత్యేక చర్చ ఉంటుందని సమాచారం.

పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతలు పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తమ వాదనని వినిపించడానికి తానే స్వయంగా ఈ చర్చలకు హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీష్ రావు.. ఉమాభారతి తో పలు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సమస్య పరిష్కారం జరగలేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రంగం లోకి దిగాడు. ఇక ఏపీ తమ నీటిని దొంగిలించడానికి ఎత్తులు వేస్తుందని... ఇంకా ఏపీలో కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి కూడా తమ వాదన వినిపించడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని హరీష్ రావు ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం లోనే పాలమూరు-రంగారెడ్డి-దిండి ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని.. కానీ ఇప్పుడు దీనిని చంద్రబాబు ఒప్పుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అలాగే పోతిరెడ్డి పాడు నుండి ఎక్కువ నీటిని ఏపీ వాడేస్తుందని ఆరోపిస్తున్నారు.

అలాగే ఏపీ సీఎం తమకు రావాల్సిన కృష్ణ జలాల పంపిణి గురించి... కృష్ణ నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి ఆపెక్స్ కౌన్సిల్ ముందు వాదన వినిపించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ లో ఎక్కడబడితే అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తే ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చంద్రబాబు అంటున్నారు. జూరాల నుండి తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుంటుంది. సముద్రం లోకి పోయే వృధా జలాలనే మేము వినియోగించుకుంటున్నామని చంద్రబాబు వాదిస్తున్నారు. 

ఎవరి వాదనలతో వాళ్ళు గట్టి పట్టు మీదున్నారు. ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. మరి ఈ సమస్యని ఉమాభారతి ఎలా పరిష్కరిస్తారో అని అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs