Advertisement
Google Ads BL

ఇంకా డైరెక్టర్ కాలేదు..అప్పుడే విమర్శలా..!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ దర్శకులుగా మారి మంచి పొజిషన్ లో కొనసాగుతున్నారు. వీరిలో ఎక్కువగా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా కొరటాల శివ ఇంకా చాలా మంది దర్శకులే వున్నారు. వీరి కథలు రాస్తూనే డైరెక్టర్స్ గా మారారు. డైరెక్టర్స్ గా మారి వీరు సూపర్ హిట్స్ ని అందించారు. అయితే వీరు రచయితలుగా వున్నప్పుడు తగిన గౌరవాభిమానాలు  లభించకనే డైరెక్టర్స్ గా మారామని చెబుతున్నారు. మొన్నటికి మొన్న కొరటాల శివ అయితే నేను 'సింహ' కథని రాస్తే ఆ సినిమా టైటిల్ లో కనీసం నా పేరు కూడా వెయ్యలేదు... ఇంకా చాలా అవమానాలే ఎదుర్కొన్నానని అందుకే కసితో డైరెక్టర్ ని అయ్యానని డైరెక్ట్ గా చెప్పేసాడు. ఇక ఈ విషయం లో బోయపాటి కూడా కొరటాల మీద సెటైర్  వేసి యుద్ధానికి సై అన్నాడు అనుకోండి. ఇది అందరికి తెలిసిన విషయమే.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు మరో రచయిత కూడా కొరటాల శివ లాగే చెబుతున్నాడు. అతనెవరో కాదు ఎన్టీఆర్ ఫ్రెండ్, రైటర్ వక్కంతం వంశీ. ఇతను కూడా డైరెక్టర్ అవ్వాలని కలలు కంటున్నాడు. మొదటి సినిమానే ఎన్టీఆర్ తో డైరెక్ట్ చెయ్యాలని ఎప్పటినుండో ఆశ పడుతున్నాడు. మరి ఎన్టీఆరేమో వంశీకి ఛాన్స్ ఇవ్వకుండా తెగ వెయిట్ చేయిస్తున్నాడు. ఇక 'జనతా గ్యారేజ్' సినిమా హిట్ అయ్యాక ఎన్టీఆర్ ఎవరైనా అనుభవం వున్న హిట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. మళ్ళీ వంశీ కి నిరాశే మిగిలింది. అయితే వంశీ.. అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పి ఒకే చేయించుకున్నాడని ప్రచారం జరుగుతున్న వేళ వంశీ.. కొరటాలలాగే కొన్ని సంచల వ్యాఖ్యలు చేసాడు.

అవేమిటంటే ఒక సినిమా పూర్తియైన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆ సినిమాలో నటించిన హీరో గురించి, ఆ సినిమా తీసిన డైరెక్టర్ గురించి లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి, ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడతారు గాని ఒక రచయిత గురించి గాని అతని పనితనం గురించి గాని ఎక్కడా చెప్పరని అంటున్నాడు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అయ్యో రైటర్ గా నీ పేరు మర్చిపోయానే సారీ అని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని వాపోతున్నాడు. ఇంకా సినిమా కథని ఒక్కో సారి రైటర్ రాసినట్టు కాకుండా సగానికి సగం మార్చేసి సినిమా తీస్తారని అదేమిటని అడిగితె... ఓ.. అదా హీరో కి నచ్చక అలా మార్పులు చేర్పులు చేశామని చెబుతారని అంటున్నాడు. అందుకే ఈ అవమానాలకు బ్రేక్ వేయాలనే.... ఇంకా నా పనితనం అందరికి తెలియాలనే నేను డైరెక్టర్ ని అవుతున్నాని చెబుతున్నాడు. మరి డైరెక్టర్ గా ఒక పెద్ద హీరోని తెరకెక్కించి హిట్ కొట్టాలనే కసితో వున్న ఈ రైటర్ గారు..ఇంకా డైరెక్టర్ కాక ముందే ఇలా మిగతా దర్శక నిర్మాతలను విమర్శించే పనిలో పడ్డాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs