కేంద్రంలోని బిజెపి సర్కార్ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని, దానికి మించిన ప్యాకేజీని వారు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కాగా ఈ ఆర్ధిక ప్యాకేజీని పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలతో పోలిస్తే, వైసీపీ ఎమ్మెల్యే రోజా దీనిని కుళ్లిపోయిన క్యాబేజీతో పోల్చింది. ఏదో ముష్టి విదిలించినట్లు ప్యాకేజీ ప్రకటించిందని అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రజల్లో ఇంతగా విమర్శలు వినిపిస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఈ ప్యాకేజీతో సరిపెట్టుకోవాలని.. దీనిని స్వాగతిస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీ వల్ల నాయకులు, కాంట్రాక్టర్లు జేబులు నిండుతాయే కానీ సామాన్య ప్రజలకు ఒనగూరే ప్రయోజనం లేదు. కానీ బిజెపితో కలిసి చంద్రబాబు ఏపీని మోడీకి తాకట్టుపెట్టారని, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా చేశాడని విమర్శలు వస్తున్నాయి. కాగా మోదీ ప్రభుత్వం ఏపీలోని అసెంబ్లీసీట్లను పెంచుతామనే హామీతో తెలుగుదేశం పార్టీని నోరు కట్టడి చేసిందని, అసెంబ్లీ స్దానాలను పెంచాలని, ఇతర పార్టీల్లోని నాయకులు తమ పార్టీలోకి వలస వచ్చిన వారికి అసెంబ్లీ సీట్లు పెంచి రాజకీయంగా వైకాపాను దెబ్బతీసేందుకే కేంద్రం వద్ద సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందనే విమర్శలను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటాడోనని వేచిచూస్తున్నారు.