Advertisement
Google Ads BL

ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ తాప్సినే!


బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌, తాప్సిలు ప్రధానపాత్రలు పోషించిన చిత్రం 'పింక్‌'. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మేధావుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ చిత్రం చూసినవాళ్లంతా ఇందులో తాప్సి నటనకు మంత్రముగ్దులవుతున్నారు. కాగా తాప్సి సిక్కు మతానికి చెందిన నటి. సిక్కు మతాచారం ప్రకారం మామూలు మనషులు ఇతరుల కాళ్లు పట్టుకోవడం నిషిద్దం. కానీ ఆ విషయాన్నే చెప్పిన తాప్సి సూజిత్‌సర్కార్‌కు పాదాభివందనం చేసింది. మా మతంలో కాళ్లకు నమస్కారం చేయడం నిషిద్దం. అయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన సూజిత్‌ సర్కార్‌కు ఈ విధంగానే నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి, ఆయనకు కాళ్లకు నమస్కారం చేసింది. మీడియా ముందే ఆమె ఈ విధంగా చేయడంపై సిక్కు మత పెద్దలు మాత్రం తాప్సి చర్యను ఖండిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనతో తాప్సి ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs