గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను పెంచేలా, రాజకీయ మైలేజ్ ఇచ్చేలా దాసరి 'సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి' వంటి సినిమాలు తీశారు. అయితే త్వరలో తన జనసేన రాజకీయ పార్టీతో ప్రత్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న పవన్‌కు కూడా అలాంటి ఇమేజ్ తీసుకొచ్చే పనిలో దాసరి నిమగ్నమై ఉన్నారు. త్వరలో దాసరి నిర్మాతగా తన సొంతబేనర్ తారకప్రభు సంస్దలో పవన్‌కు కూడా రాజకీయ మైలేజీ పెంచడం కోసమే దాసరి కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'బోస్' అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారు. తన భావాలకు అనుకూలంగా ఏ దర్శకుడైతే తన ప్లానింగ్ ప్రకారం తీయగలడోనన్న వేటలో దాసరి ఉన్నాడని... ఏ దర్శకుడూ తన అంతర్మధనాన్ని సరిగ్గా అర్దం చేసుకోకపోతే తానే ఈ చిత్రానికి దర్శకత్వ బాద్యతలను కూడా చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని దాసరి తన సహచరులకు ఈ విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. మరి ఫ్లాప్‌ల్లో ఉన్న దాసరిలో ఇప్పటికీ ఆ సత్తా ఉందా? యంగ్ టాలెంటెడ్ దర్శకుల మాదిరిగా దాసరికి దర్శకత్వం వహించే సత్తా ఉందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'పరమ వీరచక్ర, ఎర్రబస్సు'తో పాటు... అసలు 'ఒసేయ్ రాములమ్మ' తర్వాత ఆయన తీసిన చిత్రాలు చూసినవారికి అదే డౌట్ కలుగుతోంది. దాసరి దర్శకత్వం అంటే మాత్రం మెగాభిమానులు ఇష్టపడకపోవచ్చని అంటున్నారు. కేవలం తాను నిర్మాతగా చేయనున్న ఈ చిత్రానికి దాసరే దర్శకత్వం వహిస్తే మాత్రం పవన్ పొలిటికల్ మైలేజీ బదులు సినిమా రంగంలో కూడా తనకున్న ఇమేజ్‌ను కోల్పోయి దాసరి వల్ల డ్యామేజ్ కావడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.