Advertisement
Google Ads BL

ఎడబాటు అంత మైత్రికి దారితీస్తుందా..!


టి. సుబ్బిరామిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని  విశాఖ‌ప‌ట్టణంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. అందులో భాగంగా మోహ‌న్‌బాబు నాలుగు ప‌దుల న‌ట ప్ర‌స్థానానికి సంబంధించిన వేడుక కూడా జ‌రిపారు. టి. సుబ్బిరామిరెడ్డి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని టిఎస్ఆర్ కళాపీఠం ఈ వేడుక  నిర్వహించింది.  కళాబంధు, రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి ఆహ్వానం మేరకు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి దాస‌రి, కె.రాఘ‌వేంద్ర‌రావు, చిరంజీవి, అల్లు అర‌వింద్... ఎందరో అతిర‌థ మ‌హార‌థులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Advertisement
CJ Advs

చిరంజీవి సభలో మాట్లాడుతూ... మోహన్ బాబుది రాక్షస ప్రేమ. విపరీతమైన అభిమానం, వాత్సల్యం చూపుతాడు. సరదాగా మేము వేసుకునే చలోక్తుల్ని బయట అందరూ పెద్ద రచ్చ చేసేస్తుంటారు. ఎందుకలా అవుతుందో అర్థం కావడం లేదు. మేమెప్పటికీ కూడా మంచి స్నేహితులం అంటూ మాట్లాడారు. కానీ గతంలో వీరిద్దరి మధ్య నడిచిన వివాదంలో మోహన్ బాబు చిరుకు కౌంటర్ వేసినప్పుడు, దానికి చిరంజీవి ఏం మాట్లాడలేదు. కానీ అన్న మీద మాట పడే సరికి పవన్ ఆవేశంగా.... ‘మోహన్ బాబు..’ అంటూ పెద్ద ఎన్ కౌంటర్ వేశాడు. దాంతో మెగా అభిమానులందరూ తమ్ముడు పవన్ తడాకా అంటే అది.. అన్న రీతిలో మాట్లాడుకున్నారు. అప్పట్లో మెగా అభిమానులంతా సంబరాలు జరుపుకున్నారు. అలాంటివన్నీ మర్చిపోయిన చిరంజీవి అలా మాట్లాడేసరికి అభిమానులంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. మొత్తానికి తమ్ముడు పవన్ ఖంగుతినేలా వ్యవహరించిన అన్న వ్యవహార దక్షతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు మాట్లాడుతూ… చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. త‌న న‌ట ప్ర‌యాణాన్ని, కిందిస్థాయి నుండి పైకెదిగిన విధానాన్ని వేదిక‌పై గుర్తు చేసుకొన్నాడు.  చిరంజీవి ఈ వేడుక‌కు హాజ‌రుకావ‌డం మోహన్ బాబుకు మ‌రింత సంతోషాన్ని తెచ్చి పెట్టింది. ఈ ఆనందంలో చిరంజీవి న‌ల‌భయ్యేళ్ల న‌ట ప్ర‌యాణానికి సంబంధించిన వేడుక‌ని నా చేతుల‌మీదుగా తిరుప‌తిలో నిర్వ‌హిస్తాన‌ని ప్రకటించాడు. అంటే 1978 ఫిబ్రవరి 11 వ తేదీ చిరంజీవి సినీరంగంలో అడుగుపెట్టాడు. అయితే చిరంజీవికి కూడా 2018 ఫిబ్రవరికి నలభయ్యేళ్ళు పూర్తవుతాయి. అలా చిరంజీవి నలభైయేళ్ళ నట ప్రస్తానానికి సంబంధించిన సభ మోహన్ బాబు చేతుల మీదుగా తిరుపతిలో ఘనంగా జరుపుతాను అని ప్రకటించాడు. కాగా చాలా కాలం నుండి చిరంజీవి, మోహ‌న్‌బాబులు  సినీ పరిశ్రమలో బ‌ద్ధ శ‌త్రువులు అన్న  విషయం తెలిసిందే.   

ఇలా చిరంజీవి, మోహన్ బాబులు ఇద్దరూ ఒక్కసారిగా ఒక‌రికొక‌రు ఆత్మీయానురాగంతో కలిసిపోయారు. అంతేస్థాయిలో మోహన్ బాబు కూడా ఒదిగిపోయాడు.  అందుకనే ‘మేం ఒక‌రికొక‌రం క‌ల‌లో కూడా చెడు కోరుకోం’ అని మోహ‌న్‌బాబు సభాముఖంగా ప్రకటించాడు కూడాను. ఇంతటి గొప్ప మైత్రిని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs