Advertisement
Google Ads BL

కావూరి..అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే..!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొట్టగానే ఏపీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ కి దూరమయ్యారు. కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సోనియా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. మరి నోరు మెదపని ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ రోజు కాంగ్రెస్ ని తెగ తిట్టేస్తున్నారు. కేవలం సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిగా చెయ్యడానికే రాష్ట్రాన్ని విడగొట్టేసిందని ఏపీ నేత కావూరి సాంబశివ రావు అంటున్నాడు. మరి ఈయన గారు కాంగ్రెస్ అధికారంలో ఉండగా కేంద్రమంత్రి పదవిని కూడా వెలగబెట్టాడు. రాష్ట్ర విభజన సమయం లో ఏపీ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ సోనియా ఏమి చెబితే దానికి తలలూపి ఇప్పుడేమో అంతా సోనియా చేసేసింది అంటున్నారు. మరి వీరు అప్పుడు విభజనకు అడ్డం పడితే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అలా కాకుండా ఏమన్నా మాట్లాడితే మంత్రి పదవులను సోనియా ఎక్కడ లాగేసుకుంటుందో అని మేడం ఏం చెబితే వాటికి గొర్రెల్లా తలలాడించారు. 

Advertisement
CJ Advs

ఇక ఏపీ విడిపోయాక ఎలాగూ కాంగ్రెస్  ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్ లో ఉంటే తమ గతి అధోగతే అని భావించిన ఏపీ కాంగ్రెస్ వారు తలో ఒక పార్టీ లో చేరిపోయారు. చాలామంది టీడీపీ అధికారంలోకి రాగానే దానిలోకి జంప్ అయ్యారు, ఇక టిడిపిలో తిరస్కరణకు గురైన వారు బిజెపి లోకి వెళ్లిపోయారు. అయితే అలా  బీజేపీలోకి వెళ్లిన వాళ్లలో పురందరేశ్వరి, కావూరి వున్నారు. వీరు బిజెపిలోకి అయితే వెళ్లారు గాని అక్కడ వీరికి అసలు గౌరవ మర్యాదలు లేవు. అయినా వారు బిజెపిలోనే కొనసాగుతూ టైం వచ్చినప్పుడు మీడియాలో లో కనబడుతూ కాలం గడిపేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం లో ఒకరోజు పురందరేశ్వరి కేంద్రాన్ని కి వకాల్తా పుచ్చుకుని మాట్లాడితే ఆమెను ఎవ్వరూ కేర్ చెయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు కావూరి గారు లైన్ లో కొచ్చారు. అంతా సోనియా నే చేసిందనే పాట పాడుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోస్తున్నాడు. ఇప్పటికైనా ఇలా కనబడకపోతే అసలు కావూరి వున్నాడా అనే అనుమానం వస్తుందని కాబోలు ఇప్పుడు కొంచెం మీడియా లో హడా విడి చేస్తూ కనిపిస్తున్నాడు. పాపం అంతే వీళ్ళు. అసలు ఇలా పార్టీలు మారి అన్నంపెట్టిన పార్టీ నే మళ్ళీ తిట్టే వాళ్లని ఏం అనాలి. మనమేం అంటాం అంతా అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది వాళ్ళని జనాలు ఏం అనుకుంటున్నారో అని.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs