Advertisement
Google Ads BL

'జగదేకవీరుడు' పైనే ఆయన ఆశలన్నీ..!!


రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా అశ్వనీదత్‌ నిర్మించిన క్లాసిక్‌ మూవీస్‌లో 'జగదేకవీరుడు.. అతిలోక సుందరి' చిత్రం చరిత్రలో మిగిలిపోయే హిట్‌ను సాధించింది. కాగా ఈ చిత్రంను రామ్ చరణ్‌తో రీమేక్‌ చేయాలని అశ్వనీదత్‌ ఎప్పటినుండో ప్రయత్నిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తన స్వప్నసినిమా బేనర్‌లో ఈ చిత్రం టైటిల్‌ను కూడా రిజిష్టర్‌ చేయించాడు. కాగా ఈ చిత్రానికి ఇప్పుడు ఉన్న దర్శకుల్లో రాజమౌళి అయితే సరిగ్గా న్యాయం చేయగలడని అశ్వనీదత్‌ భావిస్తున్నాడు. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో రాజమౌళి డేట్స్‌ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా అశ్వనీదత్‌ కూడా ఈ చిత్రానికి మరలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయన వెంటపడుతున్నాడని సమాచారం. అయితే ఈ వయసులో రాఘవేంద్రరావు ఈచిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తాడా? లేక మరో దర్శకునికి రికమెండ్‌ చేస్తాడా? అనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న అశ్వనీదత్‌ మాత్రం ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి ఓ పెద్ద హిట్‌ను కొట్టాలని భావిస్తున్నాడట. మరి ఆయన ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయో వేచిచూడాల్సివుంది. దీనికోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs