తాజాగా 'జనతా గ్యారేజ్' చిత్రంతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్‌కి చేరింది. వరసగా 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఎన్టీఆర్ ఇమేజ్ బాగా పెరిగింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ నటించబోయే తదుపరి చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ దర్శకుల నుంచి యంగ్ డైరెక్టర్స్ వరకు చాలామంది ఎన్టీఆర్‌కు తగ్గ స్టోరీలను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. వక్కంతం వంశీ చిత్రం ఉంటుందా? లేదా అన్న విషయం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. కాగా దర్శకుడు పూరీజగన్నాథ్ ఎన్టీఆర్‌కు ఇప్పటికే ఓ స్టోరీలైన్ వినిపించాడు. ప్రస్తుతం పూరీ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా 'ఇజం' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం జయాపజయాలపై పూరీ-ఎన్టీఆర్ సినిమా ఆధారపడివుంది. కాగా యువదర్శకులు అనిల్‌రావిపూడి కూడా ఎన్టీఆర్ కోసం ఓ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేయాలని, కళ్యాణ్‌రామ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కోసం ఎప్పటినుండో ఓ పక్కా మాస్ చిత్రం చేయాలని భావిస్తూ వచ్చిన తమిళ టాప్ డైరెక్టర్ లింగుస్వామి తాను బన్నీ కోసం తయారుచేసుకున్న సబ్జెక్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎన్టీఆర్ పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడని సమాచారం. మరి ఈ లిస్ట్‌లో మరెంత మంది చేరుతారో? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.