బాలీవుడ్ హీారో అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పార్షడ్. ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య ఈ సినిమా తాలూకూ ఓ శృంగార సన్నివేశం లీక్ అయిపోయి యూ ట్యూబ్ లో హల్ చల్ చేసి నెటిజెన్లను అలరించిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత నెటిజన్ల నుండి ఈ శృంగార బాంబ్ అవాకులు చవాకులు వంటివి కూడా చవి చూసింది. కాగా ఈ విషయంపై తాజాగా చిత్ర దర్శకురాలు లీనా యాదవ్ స్పందించింది. అప్పట్లో నెటిజన్లు ఈ సినిమా తాలూకూ లీకైన సన్నివేశంపై అమితాసక్తి చూపారని, కానీ ఆ తర్వాత దాన్ని అంతగా పట్టించుకోలేదని దర్శకురాలు అన్నారు. ఏదైనా సరే శృంగార సన్నివేశాల లీకులపై జనాలు అమితంగా ఆసక్తి చూపడం సహజమే కదా అని ఆమె తెలిపారు. కాగా ఈ సినిమాలో అశ్లీలత అన్నదే లేదని, ఈ పార్షద్ సినిమా వితంతువు, సెక్స్ వర్కర్, వైవాహిక లైంగిక దాడి, బాధితురాలి జీవితాన్ని ఆదారంగా చేసుకొని అద్భుతంగా తెరకెక్కిన చిత్రంగా దర్శకురాలు వెల్లడించారు. కాగా రాధికా ఆప్టే చాలా అందంగా ఈ చిత్రంలో ఫర్ఫార్మెన్స్ ఉంటుందని వివరించింది.
కాగా ఈ నెల 23వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రం కథ పూర్తిగా సామాజిక చిత్రణకు అద్దం పట్టేదిలా ఉంటుందని ఆమె వివరించింది. ఈ సందర్భంగా ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.