పవన్ లో రచయిత దాగున్నాడనే విషయం ఎప్పుడో తేటతెల్లమైంది. ఆ మధ్య పవన్ ఒక పుస్తకాన్ని రాసాడు. ఆ పుస్తకం 'ఇజం' పేరుతో ప్రింటయిన సంగతి అందరికి తెలిసిందే. ఆ పుస్తకానికి మంచి స్పందనే వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ ప్రత్యేక హోదా కై పోరాటం జరుపుతూ తిరుపతి, కాకినాడలలో సభలు నిర్వహించి రాజకీయ పరంగా బాగా బిజీ అవుతున్నాడు. అయితే ఇలా బహిరంగ సభలు పెడుతుంటే పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేస్తున్నారు. అలాగే కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ని దగ్గర నుండి చూడాలని ఆత్రం తో మేడల మీదకి, చెట్ల పైకి ఎక్కి కాళ్ళు విరగ్గొట్టుకుని.... ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కాకినాడ సభలో పవన్ అభిమాని ఇలానే మృతి చెందాడు. అభిమానులని ఎంతలా కంట్రోల్ చేసినా పరిస్థితులు చేదాటిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వున్నాయి. ఈ ఘటనపై స్పందించిన పవన్ ఇక ఇలాంటి సభలు, సమావేశాలు నిర్వహించనని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. మరి రాజకీయం గా ముందుకెళుతున్న పవన్ ఇలా సభలు గట్రా నిర్వహించకుండా తన ఆలోచనలను కార్యకర్తలకి, ప్రజలకి ఎలా చేరవేస్తాడు అనే డౌట్ చాలా మందికి ఆల్రెడీ వచ్చేసింది. అయితే పవన్ కొంచెం తెలివిగా ఆలోచించి తన ఆలోచనల్ని ప్రజలకు చెర వేసేందుకు ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదే తానూ ఎలాగూ రచయిత అవతారం ఎత్తాడు కాబట్టి ఒక పుస్తకాన్ని రాద్దామని అనుకుంటున్నాడట. ఇప్పటికే 'ఇజం' పుస్తకం లో తన ఆలోచనలకి పదును పెట్టిన పవన్... ఇప్పుడు 'నేను మనం జనం' అనే పుస్తకం లో తానేం చెయ్యాలనుకుంటున్నాడో చెప్తాడట. 'నేను మనం జనం' పుస్తకానికి 'మార్పు కోసం యుద్ధం' అనే టాగ్ లైన్ కూడా ఉందట. ఇక ఈ పుస్తకం లో పవన్ జనసేన సిద్ధాంతాలపై ఒక క్లారిటీ ఇస్తాడని సమాచారం. ఇజం లో కంటే ఎక్కువ క్లారిటీగా ఈ పుస్తకంలో వివరిస్తాడని అంటున్నారు. మరి పవన్ తన.. ఈ పుస్తకం ద్వారా ప్రజలకు ఎంతవరకు చేరువవుతాడో చూద్దాం...