ఈ మధ్య సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయం లో రచ్చ జరుగుతూనే ఉంటుంది. టైటిల్ విషయంలో, పేర్ల విషయంలోగాని ఇలాంటి విషయాలు బయటకొచ్చి గొడవలకు కారణమవుతూ ఉన్నాయి. అయితే తాజాగా మరో ఘటన జరిగింది. అదేమిటంటే శ్రీకాంత్ నటించిన 'మెంటల్' సినిమా గత వారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అసలు దర్శకుని పేరు వెయ్యకుండా మరో పేరు టైటిల్ లో వెయ్యడంతో గొడవ స్టార్ట్ అయ్యింది. 'మెంటల్' సినిమాకి బాబ్జి అనే అతను డైరెక్ట్ చేస్తే బాబ్జి పేరు టైటిల్స్ నుండి తొలగించి బషీర్ అనే వ్యక్తి పేరు వేశారని బాబ్జి ఆరోపిస్తున్నాడు. అంతే కాకుండా 'మెంటల్' సినిమాకి దాదాపు 5.20 లక్షల పెట్టుబడి కూడా పెట్టినట్లు బాబ్జి చెబుతున్నాడు. ఈ సినిమాకు తెరకెక్కించడానికి నేనెంతో కష్టపడ్డానని అలాంటి నా పేరు వెయ్యకుండా అతని పేరు ఎలా వేస్తారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని హీరోగా నటించిన శ్రీకాంత్ కి చెబితే నేను మాట్లాడి మీ పేరు టైటిల్ లో వేయిస్తానని మాట ఇచ్చాడని... కానీ అది జరగలేదని అంటున్నాడు. నా పేరు గనక టైటిల్స్ వెయ్యకపోతే ఛాంబర్ ఎదుట దీక్ష చేస్తానని... దానికి స్పందించకపోతే బషీర్ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తపరిచాడు. మరి నిజమే సినిమా మొదటి పోస్టర్ విడుదల చేసినప్పుడు దర్శకుడిగా బాబ్జి పేరు వేసి ఇప్పుడు విడుదల టైం కి వేరొకరి పేరు వేయడం దారుణం కదండీ. అయితే బాబ్జి ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించగా అక్కడున్నవారు ఈ సినిమా నిర్మాత గనక మాకు కంప్లైంట్ చేస్తే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కుదురుతుందని చెబుతున్నారు. ఇక ఈ దర్శకుడు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడని సమాచారం.