సినిమా అవకాశాలతోనే కాదు, బిజినెస్ ఎండార్స్‌మెంట్లతోనూ అదరగొడుతుంటుంది సమంత. కాస్మొటిక్స్, ఫుట్ వేర్, బట్టలకి సంబంధించిన షాపింగ్ మాల్స్, డ్రింక్స్... ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తోంది. నెలకొక కొత్త ప్రాజెక్టైనా ఆమె చేతికి అందుతుండటంతో రెండు చేతులా సంపాదిస్తోంది. అయితే ఇటీవల ఆమె దృష్టి రియల్ ఎస్టేట్ రంగంపైనా పడినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లకి కథానాయికలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం అరుదు. కానీ సమంతకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెని ఓ సంస్థ సంప్రదించింది. నిన్ననే ఆ సంస్థకి సంబంధించిన బ్రోచర్‌ని లాంచ్ చేసింది సమంత. ఇలాంటివి రెండు మూడు క్లిక్కయ్యాయంటే ఇక సమంత రియల్ రంగంలోనూ ఎండార్స్‌మెంట్లతో దూసుకుపోవడం ఖాయమని చెప్పొచ్చేమో.
Advertisement
CJ Advs