Advertisement
Google Ads BL

'జనతా గ్యారేజ్‌' అక్కడ ఫ్లాప్‌...!


తెలుగురాష్ట్రాల్లో దుమ్ముదులుపుతున్న 'జనతా గ్యారేజ్‌' నిశ్శబ్దంగా సంచలనాలను సృష్టిస్తూ రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రం తెలుగులో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే మరోపక్క ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ మాత్రం అక్కడి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు నిత్యామీనన్‌ వంటి మలయాళ నటులు కీలకపాత్రలు చేసినప్పటికీ ఈ చిత్రం మలయాళీలను ఆకట్టుకోలేకపోతోంది. ఈ చిత్రం మొదటి వారం కేవలం రూ.3.22 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. కాగా ఈ చిత్రం మలయాళ డబ్బింగ్‌ వెర్షన్స్‌ను రూ.8కోట్లకు కొన్నారు. అయితే ఈ చిత్రం ఫుల్‌రన్‌లో కేవలం రూ.4కోట్లు వసూలు కావడమే కష్టమని, దీంతో మలయాళ వెర్షన్‌ను కొన్నవారికి రూ.4కోట్లు నష్టం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఈ చిత్రం ఇంతలా మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి అసలు కారణం ఏమిటా? అని వారు తలలు పట్టుకుంటున్నారు. 'జనతా గ్యారేజ్‌' కేవలం తెలుగులో మాత్రమే తప్ప మలయాళంలో ప్రేక్షకుల అభిరుచిని ఏ విషయాల్లో ఆకట్టుకోలేకపోయిందనే విషయమై ట్రేడ్‌వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs