వై.యస్.జగన్‌కు కేసీఆర్ ఆదర్శంగా నిలిచాడు. సహజంగా రాష్ట్ర విభజనకు కారణమైన నాయకుడిపై వ్యతిరేకత ఉండాలి. కానీ జగన్‌కు మాత్రం స్పూర్తిగా నిలవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జరిపే ఉద్యమం గురించి జగన్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కేసీఆర్ జరిపిన ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఆంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అసాధ్యం అని అనుకున్నదానిని ఉద్యమం ద్వారా కేసీఆర్ సాధించారని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం మొక్కవోని ధైర్యంతో ఉద్యమం ద్వారా హోదా సాధించాలని జగన్ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ విషయంలో జగన్‌ను అభినందించాల్సిందే. ఇది కేసీఆర్‌కు మైలేజ్ ఇచ్చే మాట.