Advertisement
Google Ads BL

పవన్ ఆకాశమా..పాసింగ్ క్లవుడా..!


పవన్ కాకినాడ సభ గురించే అందరు మాట్లాడుకుంటారు అనుకున్న తరుణం లో కేంద్రం స్పెషల్ స్టేటస్ కి బదులు స్పెషల్ ప్యాకేజి ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు పవన్ సభ గురించి దేవుడెరుగు ఏపీ అంతా ప్యాకేజి వద్దు మాకు హోదానే కావలి అని ఆందోళనలు చేసేస్తున్నారు. ఇక పవన్ సభకు ఎలాగూ ఇంకోరోజు టైం వుంది కాబట్టి ఈ ఆందోళనలు రేపటికి సద్దుమణిగే అవకాశం ఉంటే పర్లేదు. లేకుంటే పవన్ సభ తూ తూ మంత్రం గా ముగించేయాల్సి వస్తుందేమో. మరి దీని గురించి పవన్ మాత్రం స్పందించడం లేదు. ఇక పవన్ కాకినాడ సభకు సంబంధించి ఏర్పాట్లు జరిగిపోయాయని అంటున్నారు. ఈ ఏర్పాట్లను జనసేన కార్యకర్తలు దగ్గరుండి చక్కబెట్టారని సమాచారం. అయితే ఇప్పుడు అంతా పవన్ ఈ సభలో ఏం మాట్లాడతాడు అని తెగ ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతాడు...... కేంద్రం ఎలాగూ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిందిగా. ఇక దీనికి సంబంధించి మాట్లాడతాడు. ఇప్పటికి పవన్ కి  ఒక క్లారిటీ వచ్చినట్లే అనుకుంటున్నారు అంతా. ఇప్పటికే పలుమార్లు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని సభలు పెట్టిన పవన్ ఈ సారి కేంద్రాన్ని డైరెక్టుగా ప్రత్యేక హోదా గురుంచి ప్రశ్నించడానికే ఈ సభని నిర్వహిస్తున్నట్లు చెప్పాడు.

Advertisement
CJ Advs

మరి కేంద్రం సడన్ గా ప్యాకేజి అంశాన్ని తెరపైకి తెచ్చి హోదాని మరుగున పెట్టేద్దామని ప్లాన్ చేసింది. మరి దీనికి చంద్రబాబు ఒప్పుకున్నట్లే కనబడుతుంది. చంద్రబాబు ఒప్పుకున్నట్లయితే.... పవన్ కూడా ప్యాకేజీకి అనుకూలంగా కనుక మాట్లాడితే ఇక అతని రాజకీయ భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగా మారుతుందనేది అక్షర సత్యం. అలా కాకుండా ప్యాకేజి మనకెందుకు హోదా కావాలని డిమాండ్ చేసి గట్టి గా నిలబడితే మాత్రం పవన్ ఇక రాజకీయాల్లో వెనుదిరిగి చూడక్కర్లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ డైలాగ్ ప్రకారం పవన్ ఇప్పుడు ఆకాశమా..పాసింగ్ క్లవుడా అనేది తేలే సమయం ఆసన్నమైంది.  చూద్దాం పవన్ ఎటువైపు మొగ్గు చూపుతాడో. పవన్ ఇక కాకినాడ కి ఈ సాయంత్రం గాని రేపు ఉదయం గాని బయలుదేరి వెళతాడని సమాచారం. ఇక కాకినాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం జరిగే సభకు పవన్ హాజరవుతాడని జనసేన కార్య కర్తలు చెబుతున్నారు. ఈ సభకు 75000 మంది వరకు హాజరవుతారని అంచనా.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs