Advertisement
Google Ads BL

పవన్ ని ఎదుర్కొలేకేనా..ఈ ప్యాకేజ్?


కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక్కసారిగా హడావుడి ప్రేమ ఎందుకు మొలిచిందంటే.. అందుకు చాలా స్పష్టమైన ఆధారాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో క్షణం క్షణం మారుతున్న రాజకీయ పరిణామాలను, వాస్తవ పరిస్థితులను గమనిస్తున్న కేంద్రం అందుకు తగిన ప్రక్రియను మొదలెట్టింది. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహనం కోల్పోయిన పరిస్థితి తెలిసిందే. ఆంధ్ర ప్రాంత ప్రజలు నమ్ముకున్న తేదేపా, భాజ‌పాలపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ళుగా నాన్చుడు ధోరణి అవలంభించింది. ఈ సమయంలో ఆంధ్రా ప్రజల తరఫున వాయిస్ వినిపించే ఓ స్వరం, పోరాడే ఓ మనిషి కోసం ఎదురుచూస్తుండిన విషయం కూడా తెలిసిందే. ఇటువంటి సమయంలో ఓ స్వచ్ఛమైన నటుడు ముందుకు రావడం, ఆయనకు ప్రజల్లో వచ్చిన భారీ స్పందనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వణుకుపుడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో పవన్ ప్రభావాన్ని పెంచుకుంటే స్వయంగా పెంచిపోషించిన వారమవుతామని అర్థమైంది. దీంతో నేతలకు వెన్నులో వణుకుపుడుతుంది. పవన్ కు ప్రజాదరణ తగ్గించేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కూడుకొని ఆలోచించి వేసిన అడుగులో భాగమే తాజాగా చేసిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.   

Advertisement
CJ Advs

కాగా ప‌వ‌న్ ప్ర‌సంగాల‌కు ప్ర‌జ‌ల్లో భారీ స్పందన వచ్చింది. అది గమనించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కు అడ్డుకట్ట వేసేందుకు అడుగులు వేస్తోంది. తిరుప‌తి స‌భ‌లో పవన్ కు వచ్చిన ఆదరణను, మైలేజ్ ను గమనిస్తే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే  జనసేనాని బలమైన నేతగా ప్రభావితుడుగా మారే ప్రమాదం ఉందని అధికార పక్షం తెలుసుకుంది. కాగా ఈ సందర్భంలో, కేంద్రం తేల్చి చెప్పేసిన సమయంలో పవన్ కాకినాడ స‌భ‌ జరుగుతుందా? ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై పవన్ విరుచుకుపడుతూ తన పోరాటాన్ని కొనసాగిస్తాడా? అనేది చూడాలి.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs