జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేష్టలు రేణుదేశాయ్ ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. పవన్, రేణూ దేశాయికి ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత విడాకులు తీసుకొని మరీ విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ అప్పటి ఆనాటి జ్ఞాపకాలు రేణూను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నట్టుంది. ఈ మధ్య అదే ధ్యాసతో రేణూ, పవన్ ధ్యానంలో మునిగిపోయి అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంది. అంతేగా మరి దూరమైతేనే కదా సమీపంనాటి విలువలు తెలిసొచ్చేది. పవన్, రేణూ విడిపోయాక రేణుదేశాయ్ తన పిల్లలతో పుణేలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య రేణుదేశాయ్ పవన్ ను తెగ గుర్తు చేసుకొని మరీ మురిసిపోతుంది. ఆ జ్ఞాపకాలలోనే జీవిస్తున్నట్టుంది రేణూ. ఆ రకంగా ఇటీవల తన మనసులోని ప్రకంపనాల తాలూకూ వాసనలను భయటపెట్టే నిమిత్తం పవన్ పాత ఫోటోలను రేణు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తోంది. ఇదే సందర్భంలో పవన్ అందం గురించి రేణూ దేశాయ్ తెగ పొగిడేస్తుంది.
తాజాగా రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మరో రొమాంటిక్ పాత ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులకు రుచి చూపింది. రేణూ తాజాగా పోస్ట్ చేసిన రొమాంటిక్ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఓ కనుబొమ్మని పైకి లేపి ఉంది. ఆ ఫోటోను షేర్ చేసి.. పవన్ కళ్యాణ్ స్కిన్ కలర్ ని చూస్తే అసూయా కలుగుతుందని రేణుదేశాయ్ కామెంట్ కూడా చేసేసింది. అంటే పవన్, రేణూను ఎంతలా ప్రభావితం చేశాడో తెలుస్తుంది. ఎంత అంటే అంతలా విడిపోయినా మానసికంగా కలిసే ఉన్నట్లుగా ప్రభావితం చేస్తున్నాడు.