కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజి ని ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ ప్యాకేజి కూడా హోదాకి ధీటుగా ఉంటుందని కేంద్రం తరుపున మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు, రాజనాథ్ సింగ్ అంటున్నారు. ప్యాకేజీలో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూసుకుంటుందని, విజయవాడను ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటిస్తుందని.... పోలవరానికి అయ్యే ఖర్చు 70% కేంద్రమే భరిస్తుందని, రాజధానిలో ప్రభుత్వ నిర్మాణాలను కేంద్రమే చేపడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇక వీటన్నిటిని విన్న శివాజీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి పిండాకూడులా ఉందని ధ్వజమెత్తాడు. కేంద్రం రాయితీలు ఇస్తే పరిశ్రమలు రావని... ఆర్ధిక వ్యవస్థ మారదని అంటున్నాడు. ఇంకా పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఇప్పటిదాకా కేంద్రం 750 కోట్లు ఇచ్చి ఇప్పుడు 70% పెట్టుకుంటామంటే విడ్డూరం గా ఉందని.... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్లు ఖర్చు చేసిందని..... ఇది కేవలం మోసపూరిత ప్రకటన తప్ప మరొకటి కాదు అని అంటున్నాడు. రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఏమూలకి సరిపోవని ఆ నిధులు కేవలం రోడ్లు వేయడానికే పనికొస్తాయని అలాంటి నిధులు మాకొద్దని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ఇంకా విశాఖ కి రైల్వే జోన్ వస్తే ఉపయోగం ఉంటుంది గాని విజయవాడకి ఇవ్వడం వలన ఎటువంటి ఉపయోగం ఉందని అంటున్నాడు. ప్రత్యేక హోదా ఇస్తే మా బతుకు మేము బతుకుతాం ప్యాకేజి తో వచ్చే దయాదాక్షిణ్యాలు మాకొద్దని కేంద్రాన్ని వేడుకుంటున్నాడు. ఒక్క శివాజీయే కాదు ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లు అందరూ ఇదే మాట చెబుతున్నారు. హోదా కి బదులు ప్రత్యేక ప్యాకేజి వల్ల ఏపీ కి ఏమి వరగదని అంటున్నారు. మరి నిజమే ఇప్పటివరకు కేంద్రం ఎన్నో నాటకాలాడి చివరికి ఏపీని దారుణం గా మోసం చూస్తుందని..జరుగుతున్న సంఘటనలు చెబుతున్నాయి.