Advertisement
Google Ads BL

తమన్నా తప్పుకుందా... తప్పించారా?


ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. కాగా ఇందులోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం తమన్నాని ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. గతంలో చిరు కూడా తనకు తమన్నాతో డ్యాన్స్‌ చేయాలనే కోరికను వెల్లిబుచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమన్నాను తప్పించి ఆ పాటకు 'సరైనోడు'లో యువ ఎమ్మెల్యేగా నటించిన కేధరిన్‌ను తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా నుండి తమన్నా తప్పుకొందా?లేక ఆమెను తప్పించారా? అనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. చిరు పక్కన ఆయనకు ధీటుగా డ్యాన్స్‌ చేయగలిగిన సత్తా ఇప్పుడున్న యంగ్‌ హీరోయిన్లలో కేవలం తమన్నాకే ఉందని అందరూ ఒప్పుకొంటారు. మరి తమన్నాను ఈ స్పెషల్‌ సాంగ్‌ నుంచి ఎందుకు తప్పించారనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs