Advertisement
Google Ads BL

మనవరాళ్ళకు జాబు రాసిన మెగాస్టార్...!


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చిన్నతనం నాటి అలవాటుకు పదును పెట్టాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఆచారాన్ని ఆచరించి చూపాడు. అమితాబ్ తన ఇద్దరి మనమరాళ్ళకు జాబులు రాసి అలనాటి అలవాటును, ఆచారాన్ని చాటుకున్నారు. కూతురు కూతురయిన నవ్య నవేలి నందా, కొడుకు కూతురయిన ఆరాధ్యలకు... ఓ లేఖ రాసి ఆదర్శంగా నిలిచి తన బాధ్యతను చెప్పకనే చెప్పాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న అమితాబ్ పలు సూచనలను కూడా అడిగాడు. 

Advertisement
CJ Advs

అమితాబ్ ఆ ఇద్దరికీ రాసిన లేఖలో 'మీ ముత్తాతలు అయిన హరివంశ రాయ్ బచ్చన్, హెచ్ నందలు మీ ఇంటిపేర్లుగా ఉండటం కారణంగా సహజంగా మీకు గుర్తింపు వస్తుంది. కానీ నంద్ అయినా కానీ, బచ్చన్ అయినా కానీ మీరు మహిళలు. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఎవరి ఆలోచనలు మీపై రుద్దినా వాటిని బట్టి జీవితాన్ని లీడ్ చేయకండి. మీ సొంత తెలివి తేటలతో జీవితంలో ఎందుగుతూ.... మీరు చేసే పనులకు మీరే కర్త, కర్మ, క్రియలు కండి ' అంటూ ఆ ఇద్దరి మనమరాళ్ళకు విడివిడిగా సూచనలు చేశాడు. 

ఇంకా అమితాబ్ ఆ లేఖలో ఇంటి పేరును బట్టి మహిళల కష్టాలు తీరవు. ఆ కష్టాలకు తగిన పరిష్కారాన్ని నీకై నీవే, నీ సొంత తెలివి తేటలతో ఆలోచించి చూసుకోవాలి. అంతేగానీ ఎవరి మాటలో విని పొట్టి పొడవు డ్రెస్ లు వేసుకో అక్కర లేదు. మీ మనస్సుకు తగిన విధంగానే వ్యవహరించండి. మీకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోండి. మీకు ఈ లెటర్ అర్థం అయ్యే నాటికి నేను ఉండకపోవచ్చు. కానీ నా జ్ఞాపకాల తాలూకూ వీలునామా శాశ్వతంగా ఉంటుంది అంటూ అభిషేక్ -  ఐశ్వర్య ముద్దుల పట్టి అయిన ఆరాధ్యకు, కూతురు కూతురయిన నవ్యకు ఉత్తరం రాశాడు.. ఈ 73యేళ్ళ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs