తెరాస ఎంపీ కవిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో కూడా మా పార్టీ విస్తరిస్తుంది అంటూ వెల్లడించింది. ఈ రకంగా ఆ టీవీ చానల్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమనీ, ఎక్కడైనా సరే కార్య కర్తల సంఖ్య పెరిగితే ఏ ప్రాంతంలో అయినా తెరాస బలపడుతుందనీ ఆమె వెల్లడించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ఆ దిశగా కూడా ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఆంధ్ర ప్రాంత ప్రజలతో సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నాడని వివరించింది.
భవిష్యత్తులో ఆంధ్రాలో కూడా తెరాస పోటీ చేసే అవకాశం ఉందా? అన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు... అలా జరిగితే నిజంగా బాగుంటుంది అంటూ సమాధానమిచ్చింది. అలా జరిగితే పార్టీ కార్యకర్తలు బాగుపడతారని, పార్టీ కూడా విస్తరించి బాగుపడుతుందని అన్నారు. కాగా కవిత వ్యాఖ్యలపై అప్పుడే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ మొదలైనవి. ఇంకా కవిత ఏమైనా పగటి కలలు కంటోందా ? అనే సైటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.