చిరంజీవి 150వ సినిమాలో కథానాయిక ఎప్పుడో ఖరారైపోయింది కదా, మళ్లీ ఇప్పుడు తమన్నా, కేథరిన్‌ల గొడవేంటి అంటారా? ఐటెమ్ పాట గురించే వీళ్లు తెరపైకొచ్చారు. చిరు 150వ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే అదిరిపోయే ఓ ఐటెమ్ పాటని సిద్ధం చేశాడు. అందులో ఆడిపాడేందుకు మొదట్లో తమన్నాని సంప్రదించారు. కారణమేంటో తెలియదు కానీ... ఆమె చేయడం లేదు. మొదట్నుంచీ చిరు సినిమాలో కథానాయికగా రేసులో ఉన్న తమన్నా ఐటెమ్ పాటలోనైనా కనిపిస్తుందనుకొంటే అది కూడా హుళక్కే అయిపోయింది. అయితే ఆ ప్లేస్‌లో కేథరిన్‌ని తీసుకొన్నట్టు తెలిసింది. కేథరిన్ కేవలం ఐటెమ్ పాట వరకే కాదట, రెండు మూడు సన్నివేశాల్లోనూ కనిపించబోతోందట. అసలేం మాయ చేసిందో తెలియదు కానీ.. మెగా కాంపౌండ్ నుంచి కేథరిన్ వరుసగా అవకాశాలు అందుకొంటోంది. చిరు పక్కన నటించే ఛాన్స్ అంటే ఆమె నక్కతోక తొక్కినట్టే లెక్క.