నేనేం పోర్న్ స్టార్ కాదంటున్న హాట్ భామ!


బాలీవుడ్ నటి, ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్  కేంద్ర సెన్సార్ బోర్డుపై తీవ్రంగా విరుచుకుపడింది. అసలు విషయం ఏంటంటే రాఖీ సావంత్ తాజాగా చేసిన ‘ఏక్ కహాని జూలీ కి’ సినిమాకు గాను సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది. ఇందుకు సెన్సార్ బోర్డుపైన, చైర్మన్ పహ్లజ్ నిహలానీలపైన రాఖీ సావంత్ తీవ్ర విమర్శలకు దిగింది.  కాగా ఈ విషయంపై ఆమె ఫైర్ అవుతూ... ‘కేంద్ర సెన్సార్ బోర్డును మూసివేయాలని, కేవలం పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకు మాత్రం ‘యు’ సర్టిఫికెట్ ఇస్తుందని అంతకు మించి వాళ్ళు చేస్తున్నదేమీ లేదని’ వెల్లడించింది. నిజంగా ఇప్పుడు సెన్సార్ బోర్డు సభ్యులు చిన్న నిర్మాతలను వేధిస్తున్నారని వివరించింది. లంచం ఇవ్వాలని పబ్లిక్ గా డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. అసలు ఆ బోర్డులో సినిమా అంటే తెలియని వారు ఉన్నారు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి నిహలానీని తప్పించాలన్నారు. ఆయనకు ఏమీ తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు కావాలంటే ఆ పదవిలో తాను కూర్చుంటాను అని వివరించింది. ఇప్పుడు చైర్మన్ గా ఉన్న నిహలానీ కంటే తాను సమర్థవంతంగా ఆపదవిని నిర్వహించగలనని తెలిపింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ... ‘వాళ్లకు మేం డబ్బులు ఇవ్వనందుకే  మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు’ అని తెలిపింది. తాను ఈ సినిమాలో నటించినందువల్లనే ఇలా చేశారని వెల్లడించింది. అస్సలు నిజంగా వాళ్ళకు బుద్ధి లేదని, ఉంటే అలా చేయరని కూడా చెప్పింది. తాను బాలీవుడ్ స్టార్ ను అని, నటిని, స్యయంగా ఈ దేశ బిడ్డనని, తానేమీ పోర్న్ స్టార్ కాదని తెల్పింది. చివరగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేవు. ఈ విషయం మీద తాము బాంబే హైకోర్టుకు కూడా వెళ్ళాం. సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తాము వారిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. అసలు దేశంలోనే సెన్సార్ బోర్డు లేకుండా తొలగించాలి’ అని రాఖీ చాలా ఘాటుగా స్పందించింది. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES