Advertisement
Google Ads BL

అబ్బ..ఏం ఛాన్స్ కొట్టాడి...హీరో..!


లవర్‌బోయ్‌గా, క్లాస్‌హీరోగా ఇప్పుడిప్పుడే స్దిరపడుతున్న యంగ్‌ హీరో.. నాగశౌర్య. ఇక ఈయన చేతిలో ఇప్పటికే మూడు చిత్రాలు ఉన్నాయి. కాగా ఈ హీరో ఇప్పుడు ఏకంగా పూరీజగన్నాద్‌ కంట్లో పడ్డాడు. మాస్‌ ఇమేజ్‌ కోరుకునే ఏ హీరో అయినా ముందుగా చేయాలనుకునేది పూరీజగన్నాథ్‌తోనే. హీరోయిజాన్ని పూరీ ఎస్లాబ్లిష్‌ చేసినంతగా ఎవ్వరూ ఆ విధమైన ఇమేజ్‌ను చూపించలేరు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ఆయన తనతో సినిమాలు చేసే హీరోల మాస్‌ ఇమేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లతాడు. కాగా ప్రస్తుతం పూరీ.. కళ్యాణ్‌రామ్‌కు కూడా అదే ఇమేజ్‌ను అందించే పనిలో భాగంగా 'ఇజం' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వక ముందే పూరీ మరో చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కూడా మొదలుపెట్టాడు. తాను తయారు చేసుకున్న స్క్రిప్ట్‌ను చిన్న స్దాయిహీరోకే సూట్‌ అవుతుందని భావించిన పూరీ ఈ చిత్రంలో హీరోగా నాగశౌర్యను ఎంచుకున్నాడు. కాగా ఈచిత్రంతో తనకు మంచి మాస్‌ ఇమేజ్‌ వస్తుందని, ఈ చిత్రం అనుకోని వరంగా నాగశౌర్య భావిస్తున్నాడు. మరి ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో మొదలు పెట్టి కేవలం 50రోజుల్లో పూర్తి చేయాలని పూరీ భావిస్తున్నాడు. మొత్తానికి ఈ వార్త విన్నవారు మాత్రం నాగశౌర్య నక్కతోక తొక్కాడని అంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs