నాగార్జునకి తిరుగులేని విజయాన్ని అందించిన చిత్రాల్లో `నిన్నే పెళ్లాడతా` ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో నాగార్జున, టబు జోడీ అదరగొట్టింది. వాళ్లిద్దరినీ తెరపై చూస్తే `ఆహా ఏం కెమిస్ట్రీ` అనిపిస్తుంది. ఆ చిత్రం ఇప్పుడు చూస్తున్నా కొత్తగానే అనిపిస్తుంది. నాగచైతన్య, అఖిల్‌లాంటి యంగ్ హీరోలతో ఆ చిత్రాన్ని నిస్సందేహంగా రీమేక్ చేయొచ్చు. అయితే నాగార్జున, టబులు అప్పటికీ ఇప్పటికీ ఒకలాగే ఉన్నారు. సో... ఆ సినిమాని రీమేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కావాలనుకొంటే మళ్లీ ఆ క్యాసెట్‌నే తిరిగి వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాగచైతన్య మాత్రం `నిన్నే పెళ్లాడతా`లో నటిస్తానంటున్నాడు. అయితే నాగ్ `నిన్నే పెళ్లాడతా`కీ, నాగచైతన్య చేస్తానంటున్న సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. అసలు విషయమేంటంటే నాగచైతన్య కథానాయకుడిగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలోనే ఆ చిత్రం తెరకెక్కబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ చిత్రానికి నిన్నే పెళ్లాడతా పేరును ఖరారు చేయనున్నట్టు సమాచారం. పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడం, అందులో పెళ్లి ప్రస్తావన కూడా ఉంటుంది కాబట్టి `నిన్నే పెళ్లాడతా` అనే పేరైతేనే బాగుంటుందని కళ్యాణ్‌కృష్ణ భావిస్తున్నాడట. అందుకు నాగార్జున కూడా ఓకే చెప్పేశారని తెలుస్తోంది. అందులో కథానాయికగా తమన్నా కానీ, లేదంటే సమంతగానీ నటించే అవకాశాలున్నట్టు సమాచారం.
Advertisement
CJ Advs