Advertisement
Google Ads BL

రోజా వల్లేనా పవన్ లో ఈ కదలిక..?


పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడి పెను సంచలనాలకు దారితీశాడు. పవన్ కళ్యాన్  అభిమాన నటుడు వినోద్ రాయల్ హత్యకు గురైన సందర్భంగా పరామర్శించడానికి తిరుపతి వెళ్ళాడు పవన్. అలా హఠాత్తుగా సభ జరపాలన్న ఆలోచన రావడం, ఆంధ్రప్రాంతం, రాజధాని, ప్రత్యేక హోదా తదితర విషయాల గురించి ప్రసంగించి అందరినీ ఆలోచింపజేశాడు పవన్ కళ్యాణ్. కాగా ఈ ప్రసంగం విని పవన్ అభిమానులంతా ఫుల్ జోష్ గా ఫీలయ్యారు. కానీ తెదేపా, భాజపాలకు మాత్రం మింగుడు పడని విధంగా మారింది. ఈ పవన్ వచ్చి మళ్ళీ కొత్త తలకాయ నొప్పి తెచ్చిపెట్టాడన్నట్లుగా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం ప్రతిదీ తనకు అనుకూలమైన మైలేజ్ కోసం ప్రతిక్షణం తాపత్రయ పడుతుంది. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రోజా సరికొత్తగా స్పందించింది. 

Advertisement
CJ Advs

వైసీపీ ఫైర్ బ్రాండ్ అని ముద్రపడ్డ ఎమ్మెల్యే రోజా పవన్ కళ్యాణ్ విషయంలో ఈసారి విచిత్రంగా ఫైర్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ తిరుపతిలో సభ పెట్టి దుమ్మురేపేలా ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి తెస్తానన్నాడంటే అదంతా నా కారణంగానే అంటూ వాక్రుచ్చింది. అబ్బో రోజా అనుకూలవతే. పవన్ పట్ల సానుకూలమైన వైఖరి కనపరుస్తున్నదంటే తను, తన మాటలు అన్నీ గాలి మాటలనా లేక సందర్భాలు, వత్తుడులు, తగిన వ్యవహారాలను బట్టి నిలకడలేని చందంగా ఆమె వ్యవహర శైలి ప్రదర్శిస్తుందా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. పైగా పవన్ అభిమానులు మంచిపని చేశారు రోజమ్మ గారు, మీ వల్లనే మా నాయకుడు తిరుపతిలో సభ పెట్టగలిగాడు అని రోజాగారికి పోన్ చేసి మరీ వాపోయారట. అంటే ఇవన్నీ రోజా సమర్థించుకోవడంలో భాగంగానే మాట్లాడిందా, లేకా మరో ఏదో రకమైన ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడిందా అన్నది తెలియాల్సి ఉంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs