Advertisement

అంబానీ.. అర్ధరాత్రి... అలిపిరి గేట్లు..!


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శ్రావణ శుక్రవారం వేంకటేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతవరకు బాగానే ఉంది కానీ వచ్చిన తీరు విషయంలోనే ఇప్పుడు భక్తులకు మింగుడు పడటం లేదు. తిరుమల వేంకటేశ్వరుని దర్శనార్ధం ముఖేష్ అంబాని కుటుంబ సమేతంగా గురువారం అర్ధరాత్రి తిరుపతి చేరుకున్నారు. ప్రతిరోజూ రాత్రి  12 గంటల నుండి తెల్లవారు జాము 3 గంటల వరకు అలిపిరి టోల్ గేట్లు మూసివేసి ఉంచుతారు. ఎవరూ వచ్చినా నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడానికి వీలు పడదు. కానీ ఈ సారి అలిపిరి వద్ద ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 

Advertisement

గురువారం అర్ధరాత్రే తిరుపతి చేరుకున్న ముఖేష్ అంబానీ కుటుంబం కోసం రాత్రి 12 గంటల తర్వాత కూడా అలిపిరి టోల్ గేట్లు అలా తెరుచుకున్నాయి. అంటే బారత దేశంలో కూడా ధనవంతులకు ఓ రకంగానూ, పేదవారికి మరో రకంగానూ ట్రీట్ మెంట్లు ఉంటాయని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. కుబేరుడు ముందు నిబంధనలు కూడా తలవంచాయన్నమాట. ఈ విషయంపై భక్తులు చాలా ఆగ్రహించారు. అర్ధరాత్రి సైతం తిరుమల వెళ్లేందుకు అంబాని వాహనానికి స్వాగతం లభించింది. కాగా శుక్రవారం తిరుమలకు చేరుకున్న ముఖేష్ అంబానీ, కుమారుడు అనంత్ శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.    

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement