Advertisement
Google Ads BL

గ్యారేజ్‌ ని మహేష్‌ వాడుకుంటున్నాడు!


ప్రస్తుతం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ భారీ ద్విభాషా చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. కాగా 100కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ ఈ చిత్రం ప్రస్తుతం పరిస్దితి చూస్తే అంత పెద్ద బడ్జెట్‌ నిజంగా పెడతున్నారా? లేదా అన్న విషయంపై అందరిలోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా నిన్న విడుదలైన ఎన్టీఆర్‌ నటించిన 'జనతాగ్యారేజ్‌' చిత్రంలో గ్యారేజ్‌ సెట్‌ను భారీగా సారధి స్టూడియోలో వేశారు. ఈ చిత్రం సెట్‌లో కేవలం కొన్ని మార్పులు చేసి అదే సెట్‌ను మహేష్‌-మురగదాస్‌లు వాడుకోనున్నారని సమాచారం. ఇటీవల వరకు చెన్నైలో షూటింగ్‌ జరుపుకున్న ఈచిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో వేసిన జనతాగ్యారేజ్‌ సెట్‌లోనే జరగనుందని సమాచారం. అయితే ఆ విషయం ప్రేక్షకులకు తెలిసేలా చేయకూడదని భావించిన మహేష్‌ చిత్ర నిర్మాతలు కలర్స్‌ను, కొద్దిపాటి మార్పులు చేసి ఈ సెట్‌ను వాడుకొంటున్నారు. ఇదే సెట్‌లో ఈ చిత్రంలోని ఓ ఫైట్‌ను, సాంగ్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం. మొత్తానికి బడ్జెట్‌ విషయంలో పొదుపు పాటిస్తున్న మహేష్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs