Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ మ‌న‌సు పారేసుకొన్నాడ‌ట‌..!


పూరి జ‌గ‌న్నాథ్  రూటే సెప‌రేటు. అన్న‌య్య‌కి క‌థ చెప్ప‌డానిక‌ని వ‌చ్చి త‌మ్ముడికి  కూడా ఓ క‌థ చెప్పి ప‌డేశాడు. దీంతో`ఇజం` ప్ర‌క‌ట‌న వెలువ‌డిన రోజే, ఎన్టీఆర్‌తోనూ  పూరి మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త బ‌య‌టికొచ్చింది. కానీ అప్పుడెవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.  క‌ళ్యాణ్‌రామ్‌తో పూరి జ‌గ‌న్నాథ్  ఇంకా  `ఇజం`  చేయాలి,  ఎన్టీఆర్ కూడా  `జ‌నతా గ్యారేజ్‌` పూర్తి చేయాలి, ఆ రెండు సినిమాలు ఎప్పుడు విడుద‌ల‌వుతాయో, ఆ లోపు  ఎవ‌రెవ‌రు ఏ సినిమాలు ఒప్పుకొంటారో  అంటూ మాట్లాడుకొన్నాయి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు.  కానీ ఆ కాంబో ఊహించ‌నంత వేగంగా   సెట్ట‌య్యేలా క‌నిపిస్తోంది. ఎప్పుడైతే పూరి క‌థ చెప్పాడో అప్పుడే పూరి సినిమాపై మ‌న‌సు పారేసుకొని, అప్పుడే  ఆ సినిమా  చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాడట ఎన్టీఆర్‌. అందుకే త‌న‌కోసం ఎదురు చూస్తున్న  వ‌క్కంతం వంశీకి కూడా మాటివ్వ‌కుండా వచ్చిన‌ట్టు తెలిసింది. త‌దుప‌రి నేరుగా పూరి సినిమాలోనే న‌టించాల‌ని ఎన్టీఆర్  తాజాగా నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలిసింది. త‌న అన్న క‌ళ్యాణ్‌రామ్‌తో పూరి తీస్తున్న `ఇజం` పూర్తి కావ‌డానికి మ‌రికొన్ని రోజులు ప‌డుతుంది. అప్ప‌టివ‌ర‌కు రెస్ట్ తీసుకొని ఆ త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే ఎన్టీఆర్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని నందమూరి కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించ‌బోతున్న‌ట్టు తెలిసింది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs