Advertisement

కొడుకుని మంత్రిని చేయాలనేనా ఇదంతా..?


విజయవాడ రాజకీయాలు మంచి వేడి మీదున్నాయి. అక్కడ పొలిటికల్ డ్రామా జరుగుతుందనే దానికి  తాజా పరిణామాలే ఉదాహరణ. దేవినేని నెహ్రూ రాజకీయాల్లో తలపండిన రాజకీయ నాయకుడు. ఎప్పటినుండో నెహ్రూ.. చంద్రబాబు నాయుడిని తీవ్రం గా విమర్శిస్తూ ఉండేవాడు. నెహ్రూ మొదట్లో తెలుగుదేశం నాయకుడే అయితే ఈయన కాలక్రమేణా కొన్ని పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి కూడా చేపట్టాడు. ఇక రాష్ట్రం విడిపోయాక నెహ్రూ కొంచెం సైలెంట్ అయినా ఆయన కొడుకు అవినాష్ యాక్టీవ్ గా కాంగ్రెస్ లో యువ నాయకుడిగా ఎదిగాడు. అయితే రాష్టాన్ని విడగొట్టి కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. ఇక కాంగ్రెస్ లో ఉంటే తనకు తన కొడుక్కి భవిష్యత్తు లేదని నెహ్రూ మళ్ళీ టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక నెహ్రూ.. చంద్రబాబుని తన నివాసం లో కలిసి చర్చించి అధికారికం గా సెప్టెంబర్ 15 న టిడిపిలో చేరతానని చెప్పాడు. దీనికి చంద్రబాబు కూడా ఒప్పుకుని నెహ్రూ ని టిడిపిలోకి సాదరం గా ఆహ్వానించాడు. ఇక నెహ్రూ ఏమి ఆశించి టిడిపిలో చేరాడో అని కాంగ్రెస్ నాయకుల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయన ఒక్కడే కాంగ్రెస్ ని వదిలిపోతే కాంగ్రెస్ కి ఏమి దండగ లేదని ఆ పార్టీ నాయకుడు రఘువీరా వ్యాఖ్యానించారు. నెహ్రూ తన సొంత గూటికి చేరుకున్నానని అన్నారుగా అని రఘువీరా అన్నారు. నెహ్రూ ...నేను ఇప్పటివరకు అద్దె పార్టీలో వున్నానని అన్నారుగా... ఇక మనమేం చేస్తాం తన సొంతం అనుకునే దానిలోకి వెళితే అని రఘువీరా అన్నారు. అయన ఒక్కడి వల్లే కాంగ్రెస్ పార్టీ నడవడం లేదని ఇంకా చాలా మంది గట్టి నాయకులే కాంగ్రెస్ కి వున్నారని అన్నారు. నెహ్రూ లాంటి రాజకీయ నాయకులూ వస్తూ వుంటారు పోతూ వుంటారు అని ఘాటుగా మాట్లాడారు. అయితే నెహ్రూ మాత్రం కాంగ్రెస్ నుండి వచ్చేసినా ఆ పార్టీ పై ఎటువంటి విమర్శలు చెయ్యకుండా హుందాగా ప్రవర్తించారు. కేవలం కొడుకు భవిష్యత్తు దృష్ట్యా నే నేను టిడిపిలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. మరి తన కొడుక్కి ఏ మంత్రి పదవో ఏపీ సీఎం చంద్రబాబుని అడగడు కదా అనుకుంటున్నారు నెహ్రూ వ్యతిరేకులు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement