'నేను పక్కా లోకల్.. పక్కా లోకల్' అంటూ కాజల్ 'జనతా గ్యారేజ్' సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులను అలరించబోతున్నసంగతి తెలిసిందే. అయితే ఈ స్పెషల్ వీడియో సాంగ్ ని 'జనతా గ్యారేజ్' చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం (31-08-16) యూట్యూబ్ లో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్ చెయ్యని కాజల్ మొదటిసారిగా 'జనతా గ్యారేజ్' లో ఐటెం సాంగ్ లో నటించింది. ఈమె ఈ సాంగ్ లో ఎలా ఉంటుందో.... ఎన్టీఆర్ పక్కన ఎలా డాన్స్ చేస్తుందో అని ఎన్టీఆర్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే 'పక్కా లోకల్' సాంగ్ లో ఎన్టీఆర్ తో ఆడి పాడిన కాజల్ చించేసిందనే చెప్పాలి. ఆమె ఎన్టీఆర్ తో కలిసి వేసిన స్టెప్స్ 'జనతా గ్యారేజ్' సినిమాకి హైలెట్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. కాజల్ వేసిన డాన్స్ కి కుర్రాళ్లు మతులు పోతాయంటే నమ్మండి. ఆ ఒంపు.. సోంపు అన్ని కాజల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయనే చెప్పాలి. మరి మొదటిసారి ఐటెం ని ఇరగదీసి కాజల్ సూపర్ అనిపించుకుంటుందనే చెప్పాలి. ఈ ఐటెం సాంగ్ ని చూసిన తర్వాత ఇక టాలీవుడ్ డైరెక్టర్స్ ఐటమ్స్ కోసం అరువు భామలను అద్దెకు తెచ్చుకోవాల్సిన అవసరం రాదనుకుంటా. ఇక 'జనతా గ్యారేజ్' సినిమా మరికొద్దిసేపట్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా వుంది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే యూట్యూబ్ లో 'పక్కా లోకల్' ఐటెం సాంగ్ వీడియో ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న 'జనతా గ్యారేజ్ సినిమా' ఈ సాంగ్ తో మరిన్ని అంచనాలను పెంచేసిందనే చెప్పాలి.