Advertisement
Google Ads BL

అప్పుడే గ్యారేజ్‌ ఓవర్‌సీస్‌ లెక్కలు!


యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌లు కలిసి కొరటాల శివ దర్శక్వంలో రూపొందిన 'జనతాగ్యారేజ్‌' విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం టీజర్స్‌, ట్రైలర్స్‌, సాంగ్స్‌ అన్ని బాగుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రీమియర్‌షోల విషయంలో ఈ చిత్రం రికార్డు థియేటర్లలో విడుదలవుతూ సెన్సేషన్‌ సృష్టించడానికి రంగం సిద్దమైంది. కాగా ఈ చిత్రంపై ఓవర్‌సీస్‌లో కూడా మంచి అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్రం ఓవర్‌సీస్‌లో 1మిలియన్‌ డాలర్లను సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఓవర్‌సీస్‌లో 2.1 మిలియన్‌ డాలర్లను సంపాదించి టాప్‌ 4 తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా రాబోయే 'జనతాగ్యారేజ్‌' చిత్రం ఓవర్‌సీస్‌లో త్రీ మిలియన్‌ మార్కుపై కన్నేసింది. ఈ విషయంలో ఎన్టీఆర్‌తో పాటు చిత్ర యూనిట్‌, ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో త్రీ మిలియన్‌ మార్క్‌ను దాటుతుందా? లేదా? అన్నది రెండుమూడు రోజుల్లో తేలిపోతుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs