యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం కొన్ని గంటల్లో రిలీజ్ కావల్సివున్నా..ఇంకా సెన్సార్ కి సంబంధించి ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్ర టాక్ గురించి బయట రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంత ఫ్రెష్ గా, ప్రకృతి నేపథ్యంలో సాగుతూ.. మంచి ఎంటర్టైన్ చేస్తుందని, సెకండ్ హాఫ్ మాత్రం కొత్తగా అనిపించినా.. ఒక సమస్య చూట్టూ తిరుగుతూ..పదే పదే ఎన్టీఆర్, మోహన్ లాల్ చేత క్లాస్ ఇప్పించడం..కొంత మందికి నచ్చినా..ఎక్కువ మందికి బోర్ కొట్టిస్తుందని అనుకుంటున్నారు. అలాగే సెకండాఫ్ అంతా..ఎంటర్టైన్మెంట్ లేకుండా..సీరియస్ మోడ్ లో సినిమా నడుస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా బాగున్నా.. సెకండాఫ్ ని ప్రేక్షకులు రీసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఈ చిత్రం ఎటువంటి విజయం పొందేది తెలుస్తుందని ఫిలిం సర్కిల్ లో సైతం వినిపిస్తుంది. ఒకవేళ ప్రేక్షకులు సెకండాఫ్ బోర్ గా ఫీలైతే...చిత్ర పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు ప్రశ్నర్ధకం గా మారింది.
ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా విజయం పై ధీమా గా వున్నారు. కొరటాల గత చిత్రాలైన మిర్చి, శ్రీమంతుడు లను మించి ఈ సినిమా విజయం సాధిస్తుందని అంటున్నారు.