పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా హీరో. ఇంకా పొలిటికల్ గా కూడా అందరికి దగ్గరవుతున్నారు. ఆయనకు వున్న అభిమానులు తో పోలిస్తే ఇండస్ట్రీ లో ఇంకా ఏ హీరోకి అంతమంది అభిమానులు లేరనేది జగమెరిగిన సత్యం. అంత ఫాలోయింగ్ వున్న పవన్ మాత్రం చాలా సింపుల్ గా, నార్మల్ గా ఉంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఒకప్పుడు తన అన్న ప్రజారాజ్యం పార్టీ కోసం కష్టపడి.... తర్వాత కొంతకాలం సైలెంట్ గా వున్నాడు. ప్రజారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రి హోదా పొందినప్పుడూ... కామ్ గా వున్న పవన్.... తర్వాత కొంత కాలానికి ఒక పక్క బిజెపిని సపోర్ట్ చేస్తూ మరో పక్క టిడిపి ని సపోర్ట్ చేసాడు. వాళ్ళని సపోర్ట్ చేస్తూనే జనసేన పార్టీని స్థాపించాడు. గత ఎన్నికల్లో బిజెపి కి, టిడిపి కి సపోర్ట్ చేసి వారి గెలుపు కోసం తన వంతు కృషి చేసాడు. ఇక పవన్ తానూ ఏం చెబితే వాటిని బిజెపి, టిడిపి వారు సపోర్ట్ చేస్తారని అనుకున్నాడు. కానీ అది అవ్వలేదు సరికదా పవన్ మాటను లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. అందుకే పవన్ ప్రత్యేక హోదా కోసం తన నోరు విప్పాడు. తన అభిమాని వినోద్ హత్య తో కదిలిన పవన్.... అభిమాని తల్లితండ్రులను ఓదార్చి పనిలో పనిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాడు. ఈ సభలో పవన్ వన్ మాన్ షో ని నడిపించాడు. పవన్ అడగాల్సిన 3 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం పై, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పై సంధించాడు. ఇంకా అడగాల్సినవన్నీ ఈ సభను వేదికగా చేసుకుని అడిగేశాడు పవన్. అయితే ఈ సభ జరిపిన తీరు సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. పవన్ విమర్శల దగ్గర నుండి ఏపీ లోని మంత్రులు, ఎంపీలు మేము రాజీనామాకు సిద్దమే అయితే హోదా వస్తుందా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ తాను ఈ సభ జరిపింది కేవలం రాజకీయాల్లో యాక్టీవ్ పాత్ర పోషించడానికి అని... ఇక రాజకీయం గా నన్ను ఎదుర్కోవడానికి సిద్ధం కండి అని హెచ్చరికలు జారీ చెయ్యడానికే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సభ తర్వాత పవన్ నెక్స్ట్ స్టెప్ కాకినాడలో సభను నిర్వహించడం.. అని చెప్పాడు. ఇక్కడే ఓ విషయాన్నీ రాజకీయ విమర్శకులు గమనించారు. పవన్ రాబోయే ఎన్నికల్లో కాకినాడ నుండి, తిరుపతి నుండి పోటీ చేస్తాడని, అందుకే ఈ రెండు చోట్లా సభను నిర్వహిస్తున్నాడని అంటున్నారు. తిరుపతి నుండి అసెంబ్లీ కి పోటీ చేసి.... కాకినాడ నుండి ఎంపీగా పోటీ చెయ్యడానికి చూస్తున్నాడని అంటున్నారు. సో..ఇదంతా చూస్తుంటే.. పవన్ పొలిటికల్గా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధం అవుతున్నాడని..ఇక రాజకీయ పార్టీలు పవన్ ని ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలనే హింట్ ఇచ్చినట్లుగా పవన్ ప్రణాళిక ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తుంది.