Advertisement
Google Ads BL

ఇంకా చైతూ, సమంతలపై అనుమానాలెందుకు!


నాగ చైత‌న్య, స‌మంత‌ల మధ్య ప్రేమ వ్యవ‌హారం చాలా కాలం నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. వారిద్దిరి మధ్య ఏదో నడుస్తుందన్న గాసిప్ తో మొదలై, మొత్తానికి వారిద్దరూ కలిసి విదేశీ టూర్లలో షికారు చేయడం వంటివి ఫోటోలతో సహా చూశారు అభిమానులు. ముఖ్యంగా మీడియా ఈ విషయంపై చాలా రాద్ధాంతం కూడా చేసింది. అనుకోకుండా కొన్ని సార్లు చెట్టపట్టాలేసుకొని షికార్లు చేస్తూ ఆ సమయంలో మీడియాకు దొరికిపోయినప్పటికీ ఈ ప్రేమికులు మాత్రం బ‌య‌ట‌ప‌డిన సందర్భాలు లేవు. తాజాగా ట్విట్టర్లో చాటింగ్స్ గట్రా మొదలెట్టి వెనక్కి తగ్గారని, నాగార్జున గుర్రుగా ఉన్నాడని కొన్ని పుకార్లు లేసినా మొన్న సమంత మాత్రం ఈ మీడియా వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంటూ వాపోయింది. అంటే ఇద్దరి మధ్య ఏదో ఉంది. అది రాద్ధాంతం చేయకండి రా బాబు అని చెప్పకనే చెప్పిందన్న మాట. కానీ తాజాగా ఓ పెళ్లి వేడుక‌లో వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపడటంతో ఇక అక్కినేని కుటుంబంతో సమంత షురూ అనిపించుకున్నట్లుగానే తెలిసిపోతుంది.

Advertisement
CJ Advs

Click Here to see the Naga Chaitanya and Samantha at Swathi Wedding Photos

హైదరాబాద్ లోని ఎన్ క‌న్వెన్ష‌న్ లో జ‌రిగిన‌ నిమ్మ‌గ‌డ్డ కుమార్తె వివాహ వేడుక‌ ఘనంగా జరిగింది. ఆ వేడుకలో నాగార్జున కుటుంబంతో సమంత కలగలసిపోయి చాలా కలుపుగోలుగా వ్యవహరించిన ఫోటోలను మనం చూశాం. అస్సలు ఈ వేడుకలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. కాగా ఈ వేడుక‌కు అక్కినేని కుటుంబం మొత్తం హాజ‌రైంది. ఈ వేడుకలో అక్కినేని కుటుంబంతో స‌మంత మెలిగిన తీరు, నాగార్జున కుటుంబంతో తగిన ప్రధాన్యం ఇవ్వడం, నాగార్జున త‌న కుటుంబ స‌భ్యుల‌తో స‌మానంగా సమంతను ఆద‌రించడం వంటివి చూస్తుంటే వీరి వివాహానికి నాగార్జున గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లుగానే  అర్థమైపోతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs