Advertisement
Google Ads BL

అక్కినేని ఫ్యామీలి హీరో హిట్‌ కొడతాడా..!


తన కెరీర్‌లో ఇప్పటివరకు రెండు మూడు ప్రాజెక్ట్‌లు మాత్రమే ఫర్వాలేదనిపించిన అక్కినేని ఫ్యామీలి హీరో సుమంత్‌.. ఇటీవలి కాలంలో ఏ మాత్రం సక్సెస్‌లు కాదు.. అవకాశాలు కూడా లేకపోవడం వాస్తవం. కాగా ఆయన ఇప్పుడు బాలీవుడ్‌లో హిట్టయిన వికీడోనర్‌ రీమేక్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ రీమేక్‌ చిత్రం సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రాడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా మల్లిక్‌రామ్‌ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. పల్లవి సుభాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వీర్యకణదానం అనే ప్రయోగాత్మక పాయింట్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నరుడా ఓ నరుడా అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. టైటిల్‌ క్యాచీగానే ఉంది. మరి ఈ సినిమా కూడా హిందీలోలాగా మంచి హిట్‌ను కొడుతుందా? లేక నిరశపరస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs