Advertisement
Google Ads BL

రాజమౌళికి కూడా అదే డౌటు..!


'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకునిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు శ్రీనివాస్‌ అవసరాల. కాగా ఆయన ఇప్పుడు నారారోహిత్‌, నాగశౌర్య, రెజీనా జంటగా ఓ రొమాంటిక్‌ మూవీ 'జ్యోఅచ్యుతానంద' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బేనర్‌పై సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే విడుదలై మంచి స్పందనను రాబడుతోంది. ఈ చిత్రంలో రెజీనా చివరికి ఎవరికి తగ్గుతుంది? అనే ఆసక్తి పెరిగిపోయింది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ క్లైమాక్స్‌ చాలా థ్రిల్లింగ్‌గా, అందరినీ ఆకట్టుకునేలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చివరకు రెజీనా ఇద్దరు హీరోల్లో ఎవరికి దక్కుతుంది? అనే విషయం ప్రేక్షకులకే కాదు.. రాజమౌళికి కూడా ఈ కన్‌ఫ్యూజనే వచ్చిందట. హీరోయిన్‌ ఎవరికి దక్కుతుంది అనే ప్రశ్న రాజమౌళికి కూడా కలగడంతో ఇప్పుడు ఈ చిత్రంపై అందరి దృష్టి నెలకొనిఉంది. మరి అవసరాల క్లైమాక్స్‌లో అందరినీ ఎంతగా ఆకట్టుకోగలడో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs