Advertisement
Google Ads BL

నయీమ్ కంటే నట్టి..బాధితులే ఎక్కువంట!


తెలుగు సినీ పరిశ్రమలో నయీమ్ కు సహకరించిన బడా బడా వ్యక్తులు తమకు తెలుసంటూ ఈ మధ్య నిర్మాత నట్టి కుమార్ తెలిపిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో నట్టి.. సి. కళ్యాణ్ వంటి కొంత మంది వ్యక్తుల పేర్లు వెల్లడించాడు. ఈ విషయంపై నిర్మాత నట్టి కుమార్.. చెంప చెళ్ళుమనేలా నిర్మాత సి. కళ్యాణ్ వాటన్నింటినీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించాడు.  నట్టి కుమార్‌పై ఓ స్థాయిలో విరుచుకు పడ్డాడు.  సహ నిర్మాత అన్న విషయం కూడా మరిచిపోయి ఆరోపణలన్నింటినీ ఖండించి నట్టి... గుట్టునంతా బయటపెట్టేశాడు. ప్రస్తుతం అంతా నయీమ్ బాధితులు, నయీమ్ బాధితులు అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం ఫిర్యాదు కౌంటర్ ఓపన్ చేస్తే కుప్పలు కుప్పలుగా నయీమ్ బాధితుల కంటే నట్టి బాధితులే ఎక్కువమంది ఉంటారని వెల్లడించాడు. అస్సలు ఒక్క మాటలో చెప్పాలంటే నట్టి కుమార్ జీవితం మొత్తం బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాలతో కూడిందని, తన సినిమాల్లో నటించే అమ్మాయిలను కూడా నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేస్తాడని వెల్లడించాడు. 'నట్టి నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని, ఆధారాలుంటే వాటిని బయటపెట్టు నట్టీ... కబడ్దార్' అంటూ సి. కళ్యాణ్ చెలరేగిపోయాడు.  ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ నయీమ్ తో సంబంధాలు ఉన్నవాళ్లు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతటి వ్యక్తి అయినా సరే  అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, తగిన శిక్ష విధించుకోవచ్చని తెలుగు సినీ పరిశ్రమ తరఫున తాను మాటిస్తున్నానన్నాడు. ఇంకా నట్టి కుమార్ వ్యక్తిగతంగా కూడా చాలా ఘోరాలు చేస్తాడని సి. కళ్యాణ్ వెల్లడించాడు. క్రైస్తవ మతం పేరు చెప్పి డబ్బులు దండుకుంటాడని, అన్నదానాలకు వసూళ్లు చేసిన డబ్బును వాడుకుంటాడని, పోస్టర్లు వేసుకుని ఆ పేరుతో కూడా డబ్బులు దండుకుంటాడని ఇవన్నీ నిజమో? కాదో? తెల్పాలని సవాల్ విసిరాడు.

Advertisement
CJ Advs

చివరగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది నట్టి కుమార్ బాధితులు ఉన్నారన్నాడు.  విశాఖలోని చాలా బ్యాంకులలో ఓవర్ డ్రాఫ్టుల పేరుతో ఓ కుంభకోణం జరిగింది... అదీ కూడా త్వరలోనే బయట పడుతుందని సి. కళ్యాణ్ వెల్లడించాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs