Advertisement
Google Ads BL

శృతిహాసన్ బ్యాక్ ఒకసారి చూశారా!!


రెండు మూడు నెలలు కష్టపడి ఓ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తే వచ్చే రెమ్యూనరేషన్‌ కేవలం ఐదు నిమిషాల ఐటంసాంగ్‌లో చేస్తే వస్తుంటే ఎవరు మాత్రం ఎందుకు చేయరు చెప్పండి...! అదే ఇప్పుడు శృతిహాసన్‌ విషయంలో జరుగుతోంది. కాగా ఆమెకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో మంచి ఇమేజ్‌ ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఏ చిత్రం ఒక పట్టాన ఒప్పుకోదనే విషయం తెలిసిందే. కాగా ఆమె కీలకపాత్ర పోషిస్తున్న నాగచైతన్య 'ప్రేమమ్‌' త్వరలో విడుదల కానుంది. అదే సమయంలో ఆమె తన తండ్రి కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న 'శభాష్‌ నాయుడు' చిత్రాల్లో నటిస్తోంది. ఇక పవన్‌ -డాలీ చిత్రంలో ఆమె మరోసారి పవన్‌తో జోడీ కడుతున్నప్పటికీ ఈచిత్రం షూటింగ్‌లో ఆమె ఇంకా జాయిన్‌కాలేదు. ఇక మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్‌ హీరోగా పరిచయం అవుతున్న 'జాగ్వార్‌' చిత్రంలో ఓ ఐటం చేయడానికి శృతిహాసన్‌ ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆ ఒక్క పాటలో నటించినందుకు గాను శృతిహాసన్‌కు రెండు కోట్లు ఇవ్వడానికి నిర్మాత సిద్దం అయ్యాడు. ఈ చిత్రం దాదాపు 70కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. అయితే శృతి గతంలో మహేష్‌బాబు 'ఆగడు', బాలీవుడ్‌లో 'ఒక్కడు'కు రీమేక్‌ 'తేవర్‌'లో ఆమె ఐటం సాంగ్స్‌ చేసింది. ఈ రెండు చిత్రాలలో ఆమె నటించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ బ్యాడ్‌సెంటిమెంట్‌ను మోస్తున్న శృతి ఐటెం తో ఈ 'జాగ్వార్‌' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs