ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉండి యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఉదయభాను అందరికీ గుర్తుండే ఉంటుంది. యాంకర్ గా ఆమె చాలా మంది అభిమానులనే సొంతం చేసుకుంది. ఉదయభాను ఒకప్పుడు బుల్లితెర హీరోయిన్ గా కూడా చెలామణి అయ్యింది. మరి ఉన్నట్టుండి కొద్దీ రోజుల క్రితం నుండి ఆమె కనిపించడం లేదు. ఆమె ఈ మధ్య యాంకరింగ్ కి దూరమై చాలా రోజులే అయ్యింది. అయితే ఉదయభాను సినిమాల్లో అవకాశాలు వచ్చి బుల్లితెరకు దూరంగా ఉందని అంటున్నారు కొందరు. అయితే తెలంగాణ రాష్టం ఏర్పడిన కొత్తలో రాజకీయాల్లోకి కూడా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. ఇక తర్వాత ఆమె కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమె వార్తల్లోకొచ్చింది. ఆమె తల్లి కాబోతోంది అనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉండడం వలన బుల్లితెరకు దూరమైందని.. అందుకే ఆమె ఎక్కడ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఉదయభాను కి గతంలో ఒకసారి పెళ్ళైన సంగతి తెలిసిందే. అది పెటాకులు అవ్వడానికి ఎన్నో రోజులు పట్టలేదు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుందో ఏమో తల్లయ్యిందంటూ వార్తలొస్తున్నాయి. స్వతహాగా ఉదయభానుకు పిల్లలంటే ఇష్టం . కానీ తన కెరీర్ కారణం గా ఇప్పటివరకు మాతృత్వానికి దూరం ఉండాల్సి వచ్చిందని ఉదయభాను మీడియాతో చాలా సార్లు చెప్పింది. మరి ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ కి సంబందించిన వార్త నిజమేనా లేక గతం లో ఒకసారి ఉదయభాను అమ్మవుతోందంటూ వచ్చిన గాసిప్స్ లాగే ఇది కూడా అవుతుందా అనేది తెలియదు. అప్పట్లో ఉదయభాను తల్లికాబోతోంది అని ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారాన్ని ఉదయభాను ఖండించిన విషయం తెలిసిందే.