ఈ మధ్యకాలంలో కేవలం ఒకటిన్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన చిత్రంగా 'పెళ్ళిచూపులు'ను చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. కాగా యుఎస్ లో మిలియన్ డాలర్ల చిత్రాలు ప్రస్తుతం ఓ బెంచ్ మార్కుగా భావిస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్‌కు తప్ప ఈ ఫీట్ ఎవ్వరికి రావడంలేదు. ఇటీవలికాలంలో నాని నటించిన 'భలేభలే మగాడివోయ్' వంటి మిడియం బడ్జెట్ మూవీ మాత్రమే ఆ మార్కును అందుకుంది. కాగా ఇప్పుడు 'పెళ్ళిచూపులు' చిత్రం ఇలా యుఎస్ లో మిలియన్ డాలర్ల చిత్రంగా నిలవడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ చిత్రం తర్వాత దర్శకుడు తరుణ్‌భాస్కర్‌కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ వీటిని ఆయన పక్కనపెట్టి తన షార్ట్‌ఫిల్మ్ అయిన 'సైన్మా'ను వెండితెరపై పూర్తిస్థాయి చిత్రంగా చేయడానికి రెడీ అవుతున్నాడు. అందరనీ ఎంతగానో ఆకట్టుకున్న తన షార్ట్‌ఫిల్మ్ 'సైన్మా'కు పూర్తి స్ధాయి సినిమాగా స్క్రిప్ట్ పనుల్లో బిజిగా ఉన్నాడని విశ్వసనీయం సమాచారం. మొత్తానికి ఒకే ఒక చిత్రంతోనే తరుణ్‌భాస్కర్‌కు ఇంతలా పేరురావడం వెనుక ఆయన టాలెంట్ దాగి ఉందనే విషయం అర్దమవుతోంది.