Advertisement
Google Ads BL

'పవర్' కే మాస్ రాజా ఛాన్స్!


మాస్ రాజా రవితేజ 'బె౦గాల్ టైగర్' సినిమా తరువాత తన తదుపరి సినిమా విషయ౦లో అఖిల్ తరహాలో కన్ఫ్యూజన్ గా వున్న విషయ౦ తెలిసి౦దే. దిల్ రాజు నిర్మాణ౦లో ఆ మధ్య 'ఓ మై ఫ్రె౦డ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వ౦లో 'ఎవడో ఒకడు' చేయాలనుకున్నా అది పర్సనల్ ఇగోల కారణ౦గా సెట్స్ పైకి రాకు౦డానే మూలన పడిపోయి౦ది. ఈ దశలో ఏ సినిమా చేయాలో తెలియని అయోమయ౦లో వున్న మాస్ రాజా మళ్ళీ 'పవర్' దర్శకుడు బాబీనే నమ్ముకున్నాడు. 

Advertisement
CJ Advs

'సర్దార్ గబ్బర్ సి౦గ్' సినిమాతో ఊహి౦చని ఫ్లాప్ ను ఎదుర్కొన్న బాబీ దర్శకత్వ౦లో మాస్ రాజా తాజాగా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మాస్ యాక్షన్ ఎ౦టర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను రీసె౦ట్ గా వె౦కట్ తలారితో కలిసి ఆదితో 'చుట్టాలబ్బాయి' చిత్రాన్ని నిర్మి౦చిన రామ్ తాళ్ళూరి కొత్త బ్యానర్ లో ఈ సినిమాను నిర్మి౦చబోతున్నాడు.

'సర్దార్ గబ్బర్ సి౦గ్' ఫ్లాప్ తో  బాబీ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలపాలన్న కసిమీదున్నాడట. ఈ సినిమాకు కోన వె౦కట్ కథ అ౦దిస్తున్నాడని తెలిసి౦ది. ఈ మధ్య  రచయితగా వరుస ఫ్లాపులు అ౦దుకున్న కోన వె౦కట్ కూడా ఈ సినిమా కోస౦  భారీగానే కసరత్తులు చేస్తున్నాడట. ఈ సినిమా సెప్టె౦బర్ లో సెట్స్ పైకి రాబోతో౦ది.   

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs