Advertisement
Google Ads BL

దేశభక్తిని చాటుకుంటోన్న బాలీవుడ్ హీరో!


అమీర్‌ఖాన్‌.. ఎంతో దేశభక్తి ఉన్న నటుడు. దేశానికి ఏమి చేయాలా అని నిరంతరం తపప పడే వ్యక్తి. ఎన్నో కోట్లు వదులుకొని సత్యమేవజయతే చేశాడు. నష్టాలు వస్తాయని తెలిసినా 'మంగల్‌పాండే' చిత్రంలో నటించాడు. ఇక ఆయన నటించిన'లగాన్‌, రంగ్‌దే బసంతి' చిత్రాల ద్వారా ఆయన తన దేశభక్తిని చాటుకున్నాడు. కానీ 'పీకే' చిత్రంతో ఆయనపై విమర్శలు వచ్చాయి దేవుడు లేడన్నాడని... దేశ ద్రోహి అన్నారు. అసలు ఆయన పాకిస్తాన్‌కు వెళ్లాలని కొందరు ఆయన్ను దూషించారు. ఆయన చేసిన 'అసహనం' కామెంట్లు ఆయనపై ఎన్నో విమర్శలకు ఆజ్యం పోశాయి. కానీ అలా విమర్శించిన వారిలో ఎక్కువమంది దేశభక్తి అంటే ఏడాదిలో రెండు సార్లు జెండా వందనం చేయడం, క్రికెట్‌ మ్యాచ్‌లో ఇండియాకు సపోర్ట్‌ చేయడం మాత్రమే దేశభక్తిని భావించేవారే ఉండడం శోచనీయం. కాగా అమీర్‌ దేశభక్తిని చాటే ఆయన దేశభక్తి మాటల్లో కాదు.. చేతల్లో చూపించే వ్యక్తి, మహారాష్ట్రలో కరవు నెలకొని పంటల సాగుకే కాదు. తాగడానికి కొద్ది మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. దీంతో అమీర్‌ తన ఫౌండేషన్‌లో తన సొంత డబ్బులతో 100మంది ఉద్యోగులను పెట్టుకుని వాడిన నీటినే మరలా వాడటం ఎలా? నీటి నిల్వ ఎలా చేయాలి? అనే విషయంలో ఎందరికో ట్రైనింగ్‌ ద్వారా నేర్పుతున్నాడు. అలా నీటిని ఎక్కువగా నిల్వచేసిన గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.50లక్షలు ఇస్తున్నాడు. దీంతో నీటిని నిల్వ చేసే గ్రామాలు పోటీ పడి నీటిని నిల్వ చేస్తున్నాయి. తన 'పానీ ఫౌండేషన్‌' ద్వారా గ్రామ ప్రజల్లో చైతన్యం తెస్తూ త్వరలో మహారాష్ట్రను కరువు లేని ప్రాంతంగా మార్చేందుకు నడుం బిగించాడు. అయితే అమీర్‌ చేస్తున్న మంచి పనిని ఇప్పటివరకు పబ్లిసిటీ చేసుకోలేదు. ఆయన ద్వారా లబ్దిపొందిన గ్రామస్తులే ఈ విషయాన్ని చెప్పడంతో ఒకప్పుడు ఆయన్ను దేశద్రోహి అన్నవారే తమ వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నారు. దీటీజ్‌.. అమీర్‌..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs