Advertisement
Google Ads BL

అవసరాల సినిమాలో మరో హీరోయిన్‌!!


బాలీవుడ్‌లో అడల్ట్‌ అండ్‌ బోల్డ్‌ మూవీగా వచ్చిన 'హంటర్‌' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. కాగా ఈచిత్రం తెలుగులో రీమేక్‌ అవుతుంది. నవీన్‌ దర్శకత్వంలో రూపొందే ఈ రీమేక్‌లో అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈచిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా రెజీనా సెలక్ట్‌ అయింది. రెండో హీరోయిన్‌గా నటి, యాంకర్‌ శ్రీముఖి ఓ హాట్‌ పాత్రలో కనిపించనుంది. ఇక మూడో హీరోయిన్‌గా 'చిన్నదాన నీకోసం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మిస్థీ చక్రవర్తిని తీసుకున్నారు . తెలుగులో సంప్రదాయబద్దంగా ఉండే పాత్రను పోషించినప్పటికీ ఈమెకు టాలీవుడ్‌లో చాన్స్‌లు రాలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌లో అడల్ట్‌ మూవీగా రూపొందిన 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ' సినిమాలో హాట్‌ హాట్‌గా నటించింది. ఇక ఈ చిత్రం చూసిన 'హంటర్‌' రీమేక్‌ టీం మిస్థీ చక్రవర్తిని హీరోయిన్‌గా తీసుకుంది. కాగా ఈ చిత్రంలో ఆమె హాట్‌ సెక్స్‌ యాటిట్యూడ్‌ ఉన్న ఓ హాట్‌ పాత్రలో కనిపించనుండటంతో ఈ చిత్రం ద్వారా తనకు టాలీవుడ్‌లో మరిన్ని చాన్స్‌లు వస్తాయనే ఆశతో ఆమె ఉంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs