Advertisement
Google Ads BL

ఇదే నిజమైతే పవన్‌కు సలాం కొట్టాల్సిందే...!


పవన్‌తో సినిమా చేయాలని అందరు నిర్మాతలు ఎంతగానో ఆశపడుతుంటారు. ఆయన ఊ అంటే 10కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూలో నిలబడతారు. కానీ అలా చేసే మనస్తత్వం ఆయనది కాదు అని అందరు అంటుంటారు. కాగా పవన్‌ ఇటీవల తాను ఎంతో ఇష్టపడి కొనుకున్న జి55 మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును పవన్‌ అమ్మేసిన సంగతి తెలిసిందే. పవన్‌ మరలా ఇప్పటి వరకు కారు కొనలేదు. దీంతో పవన్‌ ఆర్దిక కష్టాల్లో ఉండి, కారును అమ్మేశాడనే వార్తలు వచ్చాయి. అయినా పవన్‌ ఊ అంటే కోట్లకు కోట్లు పారితోషికం ఇచ్చే నిర్మాతలు ఉండగా కేవలం రెండు కోట్లు కూడా చేయని కారును పవన్‌ అమ్ముకోవలసిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అయితే పవన్‌ ప్రస్తుతం ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమేనని అందరూ అంటున్నారు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'కు నిర్మాతలలో ఒకడిగా ఉన్న పవన్‌కు భారీ నష్టాలే వచ్చాయి. కానీ పవన్‌ ఓ మంచి పని కోసమే తన కారును అమ్మేశాడని వార్తలు వస్తున్నాయి. తాను ఓ సందర్భంలో గుండెజబ్బులతో బాధలు పడుతున్న చిన్నారులకు ఆపరేషన్‌ చేయిస్తానని మాట ఇచ్చాడట. సరిగ్గా ఆ సమయానికి చేతిలో లిక్విడ్‌ క్యాష్‌ లేకపోవడంతో ఆయన తన కారును అమ్మి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడట. దాంతో పాటు త్వరలో తాను రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలో ఇలాంటి ఖరీదైన వస్తువులు తనను ప్రజల నుంచి దూరం చేస్తాయని, అందుకే సింపుల్‌ జీవితానికి అలవాటుపడాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు హాట్‌ టాపిక్‌గా చర్చకు వస్తోన్నాయి. ఇదే గనక నిజమైతే పవన్‌కు సలాం కొట్టాల్సిందే..! ఏమంటారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs